- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, వెబ్ డెస్క్: బిగ్‌బాస్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన అందాల భామ దివి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్‌లతో బిజీగా ఉంటూ తన కెరీర్‌ను విజయవంతంగా ముందుకు తీసుకెళ్తోంది.
అయితే నటనతో పాటు సోషల్ మీడియాలోనూ దివి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. తరచూ గ్లామరస్ ఫోటోషూట్‌లకు సంబంధించిన పిక్స్ ను అభిమానులతో పంచుకుంటూ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. దీంతో ఆమె ఫాలోవర్ల సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతోంది.
తాజాగా దివి షేర్ చేసిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఎరుపు రంగు చీరకు మ్యాచింగ్ బ్లౌజ్ ధరించిన ఈ భామ, బెడ్‌పై కూర్చొని సైడ్ యాంగిల్‌లో తన నడుము అందాలు హైలైట్ అయ్యేలా స్టైలిష్ పోజులు ఇచ్చింది.
అంతేకాకుండా అందమైన ఆభరణాలు, చేతినిండా గాజులు, నుదుటిపై బొట్టు, ముఖంపై అలవోకగా జారిన కురులతో దివి మరింత అందంగా కనిపించింది. ఆమె ఇచ్చిన ప్రతి పోజ్ అభిమానులను మంత్రముగ్ధులను చేస్తోంది.
మొత్తంగా ఈ ఫోటోల్లో దివి తన అందం, హావభావాలతో ప్రత్యేక ఆకర్షణగా నిలవడంతో నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.
Photos Courtesy: Instagram






