తిరుమల శ్రీవారి దర్శన అప్‌డేట్స్: 5 కంపార్టుమెంట్లలో వేచి ఉన్న భక్తులు

by Malleboina Mahesh |

తిరుమలలో సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 65,354 మంది భక్తులు దర్శించుకోగా, హుండీ ఆదాయం రూ. 4.43 కోట్లుగా నమోదైంది.

తిరుమల శ్రీవారి దర్శన అప్‌డేట్స్: 5 కంపార్టుమెంట్లలో వేచి ఉన్న భక్తులు
X

దిశ, వెబ్ డెస్క్: కలియుగ వైకుంఠమైన తిరుమలలో భక్తుల తాకిడి సాధారణంగా కొనసాగుతోంది. నేడు (ఏప్రిల్ 23, 2026) వేకువజామున అందుతున్న సమాచారం ప్రకారం, శ్రీవారి దర్శనం కోసం భక్తులు 5 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనం (SSD) ద్వారా శ్రీవారిని దర్శించుకోవడానికి సుమారు 8 గంటల సమయం పడుతోంది. ఎండల తీవ్రత దృష్ట్యా, కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులకు టీటీడీ అధికారులు నిరంతరాయంగా పాలు, తాగునీరు మరియు అన్నప్రసాదాలు అందిస్తున్నారు.

ఇదిలా ఉంటే నిన్న ఒక్కరోజే 65,354 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సుమారు 25,550 మంది భక్తులు తమ మొక్కులను తీర్చుకుంటూ తలనీలాలు సమర్పించారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా శ్రీవారి హుండీకి రూ. 4.43 కోట్ల ఆదాయం లభించింది. రేపటి నుంచి స్కూల్లకు సెలవులు ఉండటంతో రద్దీని దృష్టిలో ఉంచుకుని, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దర్శనం లైన్లను క్రమబద్ధీకరించినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. తిరుమలలో మధ్యాహ్న సమయాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున, భక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Next Story