తిరుమల లడ్డూ రికార్డు అమ్మకాలు

by Muthe.Rajitha |

కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయాల్లో సరికొత్త రికార్డు నమోదైంది.

తిరుమల లడ్డూ రికార్డు అమ్మకాలు
X

దిశ, వెబ్ డెస్క్ : కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయాల్లో సరికొత్త రికార్డు నమోదైంది. గతంలో ఎన్నడూ లేనంతగా జూన్ నెలలో రికార్డ్ స్థాయిలో లడ్డూ ప్రసాదాలు అమ్ముడైనట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) బోర్డు అధికారికంగా ప్రకటించింది. వేసవి సెలవుల కారణంగా భక్తుల రద్దీ భారీగా పెరగడంతో లడ్డూల విక్రయాలు ఈ స్థాయికి చేరినట్లు అధికారులు తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్ నెల నుండి లడ్డూల విక్రయాలు నిరంతరం పెరుగుతూ వచ్చాయి. దేవస్థానం వెల్లడించిన గణాంకాల ప్రకారం.. ఏప్రిల్ నెలలో 1,11,96,170 లడ్డూలు, మేలో 1,21,35,528 లడ్డూలు అమ్ముడవగా.. జూన్ నెలలో 1,26,81,805 లడ్డూలు అమ్ముడయ్యి రికార్డు సృష్టించాయి. ఇక గత 2025 జూన్ నెలలో 1,19,21,353 లడ్డూలు అమ్ముడవగా.. ఈ ఏడాది జూన్ నెలలో ఏకంగా 7,59,452 లడ్డూలు అదనంగా విక్రయించడం విశేషం. భక్తులకు ఎలాంటి కొరత లేకుండా నిరంతరాయంగా ప్రసాదాన్ని అందించేందుకు టీటీడీ లడ్డూ పోటు సిబ్బంది ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. తిరుమల చరిత్రలోనే ఒకే నెలలో ఈ స్థాయిలో లడ్డూలు విక్రయించడం ఇదే తొలిసారి అని అధికారులు పేర్కొన్నారు.

Next Story