- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మున్సిపల్ ఎన్నికల ఫలితాలకు వేళాయె
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లో ఒక కార్పోరేషన్, 18 మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు శుక్రవారం ఉదయం 8 గంటలకు ప్రారంభం అయింది.

మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్‌తోపాటు ఉమ్మడి జిల్లాలోని 18 మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. పాలమూరు విశ్వవిద్యాలయం తో పాటు ఆయా జిల్లాల్లోని కీలక విద్యా సంస్థల్లో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాలకు ఇప్పటికే బ్యాలెట్ బాక్సులను కట్టుదిట్టమైన భద్రత మధ్య తరలించారు. నేడు ఉదయం 8 గంటల నుంచి పోస్టల్ బ్యాలెట్లతో లెక్కింపు మొదలుకానుండగా, ఉదయం 9:30 గంటల కల్లా తొలి ఫలితం వెలువడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రక్రియ కోసం జిల్లాల కలెక్టర్ల పర్యవేక్షణలో సిబ్బందికి ఇప్పటికే మాక్ కౌంటింగ్ నిర్వహించి శిక్షణ ఇచ్చారు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు తమ విజయాలపై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తుండడంతో రాజకీయ వాతావరణం ఉత్కంఠగా మారింది. మున్సిపల్ పీఠాలను దక్కించుకునేది ఎవరో తేలే ఈ కౌంటింగ్ ప్రక్రియ మొత్తం సీసీ కెమెరాల నిఘాలో పారదర్శకంగా జరగనుంది.
దిశ, మహబూబ్ నగర్ బ్యూరో : మున్సిపల్ ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో వెల్లడి కానున్నాయి. బుధవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు 18 మున్సిపాలిటీలకు ఉత్కంఠ భరిత వాతావరణంలో ఎన్నికలు జరిగాయి. ఇప్పటికే పోలింగ్ బాక్సులను కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య కౌంటింగ్ కేంద్రాల వద్దకు చేర్చారు. గురువారం ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ముందుగా 25 ఓట్లను బెండళ్లుగా కట్టిన అనంతరం లెక్కింపు ప్రక్రియను ప్రారంభిస్తారు. మొదటి ఫలితం 9:30 గంటల నుంచి 10:30 గంటల మధ్య పిలువడే అవకాశాలు ఉన్నాయి.
కౌంటింగ్ కేంద్రాల వివరాలు…
మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్, భూత్పూరు, దేవరకద్ర మున్సిపాలిటీల కౌంటింగ్ పాలమూరు విశ్వవిద్యాలయం లో జరగనుంది. గద్వాల మున్సిపల్ ఫలితాలు స్థానికంగా ఉన్న పాలిటెక్నిక్ కళాశాల, ఐజ కౌంటింగ్ అదే మున్సిపాలిటీ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, అలంపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల, వడ్డేపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కౌంటింగ్ ను నిర్వహిస్తారు. నారాయణపేట మున్సిపాలిటీ కౌంటింగ్ యాద్గిర్ రోడ్డులో ఉన్న గురుకుల పాఠశాల, కోస్గి లో ఇంజనీరింగ్ కళాశాల, మద్దూరు మున్సిపాలిటీ ఓట్లను అదే పట్టణంలోని జూనియర్ కళాశాలలో , మక్తల్ మున్సిపాలిటీకి సంబంధించి మినీ స్టేడియంలో ఓట్లను లెక్కించేందుకు ఏర్పాటులు పూర్తి చేశారు.
నాగర్ కర్నూల్ మున్సిపాలిటీకి సంబంధించి మెడికల్ కళాశాల సమీపంలో ఉన్న నైస్ పాఠశాల, కొల్లాపూర్ మున్సిపాలిటీకి సంబంధించి అదే మున్సిపాలిటీలోని ప్రభుత్వ డిగ్రీ పీజీ కళాశాల, కల్వకుర్తి మున్సిపాలిటీ ఓట్లు బ్రమరాంబిక మల్లికార్జున బీఈడీ కళాశాలలో నిర్వహిస్తారు. వనపర్తి మున్సిపాలిటీకి సంబంధించి ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పెబ్బేరు మున్సిపాలిటీ కౌంటింగ్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, కొత్తకోట మున్సిపాలిటీ కౌంటింగ్ ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఆత్మకూరు మున్సిపాలిటీ ఓట్లు ప్రభుత్వ జూనియర్ కళాశాల, అమరచింత మునిసిపాలిటీ లెక్కింపు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తారు.
మాక్ కౌంటింగ్…
శుక్రవారం జరగనున్న కౌంటింగ్‌ను దృష్టిలో ఉంచుకొని ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో కౌంటింగ్ నిర్వహించే అధికారులు, సిబ్బందికి గురువారం మాక్ కౌంటింగ్ నిర్వహించారు. చెల్లిన, చెల్లని ఓట్లను గుర్తించడం, అభ్యంతరాల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై ఓకే అన్న కల్పించారు.






