ఏపీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఫిక్స్

by Malleboina Mahesh |

ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ముహుర్తం ఫిక్స్ అయింది. ఫిబ్రవరి 14వ తేదీన రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం ముమ్మరంగా కసరత్తు చేస్తోంది.

ఏపీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఫిక్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు (Budget meetings) ముహుర్తం ఫిక్స్ అయింది. ఫిబ్రవరి 14వ తేదీన రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. ఈ సమావేశాలను సుమారు 18 నుంచి 21 పనిదినాల పాటు సుదీర్ఘంగా నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, భవిష్యత్తు అభివృద్ధి ప్రణాళికలు, సూపర్ సిక్స్ పథకాల అమలుకు అవసరమైన నిధుల కేటాయింపులే లక్ష్యంగా ఈ బడ్జెట్ ఉండబోతోంది.

కాగా ఈ బడ్జెట్ సమావేశాల తొలి రోజున ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. గవర్నర్ ప్రసంగం ముగిసిన వెంటనే శాసనసభ బిజినెస్ అడ్వైజరీ కమిటీ (BAC) సమావేశం కానుంది. ఈ కమిటీ సమావేశంలోనే బడ్జెట్ ప్రవేశపెట్టే తేదీ తో పాటు, అసెంబ్లీ పనిదినాలు, చర్చించాల్సిన ప్రధానాంశాలపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. అమరావతి రాజధాని పనులు, పోలవరం ప్రాజెక్టు వంటి కీలక అంశాలపై ఈ సమావేశాల్లో ప్రభుత్వం వివరణ ఇచ్చే అవకాశం ఉంది.

Next Story