నగరంలో భారీ విషాదం.. 11 మంది సజీవదహనం

by S Gopi |   (  Updated:2022-03-23 06:36:56  IST  )

దిశ, వెబ్ డెస్క్: నగరం నడిబొడ్డున భారీ విషాదం చోటు చేసుకుంది. మంటల్లో..Timber depot goes up in flames in secunderabad

నగరంలో భారీ విషాదం.. 11 మంది సజీవదహనం
X

దిశ, వెబ్ డెస్క్: సికింద్రాబాద్‌ బోయగూడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. టింబర్‌, తుక్కు (స్క్రాప్‌) గోదాంలో షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో చిక్కుకుని 11 మంది సజీవ దహనమయ్యారు. తెల్లవారుజామున 4 గంటలకు అగ్నిప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అగ్నిప్రమాద సమయంలో టింబర్‌ డిపోలో 15 మంది కార్మికులు ఉన్నట్లు సమాచారం. మృతులంతా బిహార్‌కు చెందిన వలస కార్మికులుగా పోలీసులు గుర్తించారు. అగ్నిప్రమాదం జరిగిన భవనంలో టింబర్‌ డిపోతోపాటు స్క్రాప్‌ గోదాం కూడా ఉంది. టింబర్‌ డిపో నుంచి స్క్రాప్‌ గోదాంకు మంటలు వ్యాపించినట్లు సమాచారం.





Next Story