- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాజానగరం to రాజమండ్రి: సీసీ కెమెరాల్లో పెద్దపులి సంచారం.. హై అలర్ట్!
మంగళవారం సాయంత్రం తూర్పుగోదావరి జిల్లాలోని రాజానగరం పరిసర ప్రాంతాల్లో పెద్ద పులి సంచారిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.

దిశ, వెబ్ డెస్క్: మంగళవారం సాయంత్రం తూర్పుగోదావరి జిల్లాలోని రాజానగరం పరిసర ప్రాంతాల్లో పెద్ద పులి సంచారిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో రంగంలోకి దిగిన అధికారులు పరిశీలించి పెద్ద పులి ఆనవాళ్లను గుర్తించారు. దీంతో స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అనంతరం రాత్రి 9 గంటల సమయంలో జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న SVPC ఫంక్షన్ హాల్ వద్ద పెద్ద పులి కనిపించింది. అక్కడి నుంచి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వైపు వెళ్లినట్టు స్థానికంగా ఉన్న ఓ సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతకు ముందు వివిధ ప్రాంతాల్లో పెద్దపులి ఆనవాల్లు కనిపించడంతో అధికారులు దానిని పట్టుకునేందుకు పలు ప్రాంతాల్లో ట్రాప్స్ ఏర్పాటు చేశారు.
కానీ ఎటువంటి పలితం లేకపోయింది. ఈ నేపథ్యంలో రాజమండ్రి సమీపంలో పులి కనిపించడంతో నగర వాసులు ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉంటే పులి సంచారం నేపథ్యంలో రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ప్రజలను అప్రమత్తం చేశారు. అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగి గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఇప్పటికే తొర్రేడు, సీతానగరం ప్రాంతాల్లో పులి ఆనవాళ్లను గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. పులిని బంధించేందుకు అత్యాధునిక డ్రోన్లు, ట్రాప్ కెమెరాలు, బోనులను ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది.
స్థానిక ప్రజలకు అధికారుల సూచనలు
పెద్దపులి సంచారం నేపథ్యంలో స్థానిక ప్రజలు ఎవరు భయపడాల్సిన అవసరం లేదని, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారని ప్రభుత్వం భరోసా ఇచ్చింది. రైతులు, ప్రజలు వ్యవసాయ క్షేత్రాలకు ఒంటరిగా వెళ్లకూడదని రాత్రి సమయాల్లో పశువుల పాకల వద్ద హై-వోల్టేజ్ లైట్లు (అధిక కాంతినిచ్చే దీపాలు) ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అలాగే అత్యవసరమైతే తప్ప రాత్రి వేళల్లో బయటకు రాకూడదని అధికారులు బోర్డులను ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో అటవీ శాఖ అధికారులు పులిని పట్టుకునే వరకు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.






