Ghani: మెగా వారసుడి సినిమాతో.. తగ్గనున్న టికెట్ ధరలు?

by Dishanational2 |
Ghani: మెగా వారసుడి సినిమాతో.. తగ్గనున్న టికెట్ ధరలు?
X

దిశ, సినిమా : మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా నటించిన చిత్రం 'గని'. స్పోర్ట్స్ డ్రామాగా రూపొందిన సినిమా ఈ నెల 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించిన చిత్రంలో సాయి మంజ్రేకర్ ఫిమేల్ లీడ్‌గా కనిపించనుంది. ఇదిలా ఉంటే.. 'ఆర్‌ఆర్‌ఆర్' వంటి భారీ బడ్జెట్ చిత్రాలు విడుదలైనపుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐదో ఆటకు పర్మిషన్ ఇవ్వడమే కాక పది రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించిన సంగతి తెలిసిందే. పెంచిన రేట్ల ప్రకారం మల్టీప్లెక్స్‌లో ఒక్క టికెట్ ధర రూ. 395 ఉండగా.. సింగిల్ స్క్రీన్ థియేటర్స్‌లో రూ. 225గా ఉంది. అయితే ప్రస్తుతం రిలీజ్‌కు సిద్ధంగా ఉన్న 'గని' భారీ బడ్జెట్ మూవీ కాకపోవడంతో తెలంగాణలో మునుపటి ధరలే అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు మల్టీప్లెక్స్‌లో జీఎస్టీ సహా రూ. 200, సింగిల్ స్క్రీన్ థియేటర్స్‌లో రూ. 150గా ఉండనుంది.

Next Story

Most Viewed