- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శ్రీలంక బోర్డుకు తుషార క్షమాపణలు
శ్రీలంక క్రికెట్ బోర్డుకు నువాన్ తుషార క్షమాపణలు తెలిపారు.

దిశ, వెబ్ డెస్క్ : శ్రీలంక క్రికెట్ బోర్డుకు నువాన్ తుషార క్షమాపణలు తెలిపారు. ఐపీఎల్ (IPL)లో ఆడేందుకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్(NOC) ఇవ్వలేదని శ్రీలంక ఫాస్ట్ బౌలర్ తుషార లంక క్రికెట్ బోర్డుపై కోర్టుకు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే బోర్డు నియమాల ప్రకారం చివరకు తన నిర్ణయాన్ని మార్చుకుని వెనక్కి తగ్గాడు. తన చర్యల వల్ల బోర్డుకు కలిగిన ఇబ్బందికి క్షమాపణలు చెబుతూ శ్రీలంక క్రికెట్ (SLC)కు ఈమెయిల్ పంపినట్లు సమాచారం. అంతేకాకుండా, బోర్డుపై తాను వేసిన కేసును కూడా ఉపసంహరించుకున్నాడు. దేశం కోసం ఆడటం కంటే, ఒక టోర్నీ కోసం బోర్డుతోనే న్యాయ పోరాటానికి దిగడంపై వచ్చిన విమర్శల నేపథ్యంలో, తుషార ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు మీడియా కథనాలు ప్రసారం చేసింది.
ఏం జరిగింది?
శ్రీలంక క్రికెట్ బోర్డు ఈ ఏడాది తమ ఆటగాళ్లందరికీ కఠినమైన ఫిట్‌నెస్ పరీక్షలను తప్పనిసరి చేసింది. శారీరక దృఢత్వం నిరూపించుకున్న వారికి మాత్రమే విదేశీ లీగ్‌లలో ఆడేందుకు ఎన్వోసీ జారీ చేయాలని బోర్డు నిబంధన విధించింది. అయితే, తుషార ఈ ఫిట్‌నెస్ పరీక్షల్లో అర్హత సాధించలేకపోయాడు. దీంతో బోర్డు అతనికి ఎన్వోసీ ఇవ్వడానికి నిరాకరించింది. తన పట్ల బోర్డు పారదర్శకతతో వ్యవహరించలేదని, తనకు అన్యాయం జరిగిందని భావించిన తుషార, నిరసనగా కోర్టును ఆశ్రయించాడు.
నువాన్ తుషార నేపథ్యం..
31 ఏళ్ల తుషార, తన విలక్షణమైన బౌలింగ్ యాక్షన్‌తో అతి తక్కువ కాలంలోనే గుర్తింపు తెచ్చుకున్నాడు. 2024లో ముంబయి ఇండియన్స్ తరఫున ఐపీఎల్ అరంగేట్రం చేసిన అతను, ఆ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టులో చేరాడు. ఆర్సీబీ తరఫున కీలక బౌలర్‌గా రాణిస్తున్న తుషార, ఫిట్‌నెస్ సమస్యల కారణంగా ఐపీఎల్ ఆడలేకపోతే అది తన కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపుతుందని భయపడి కోర్టుకు వెళ్లాడు. అయితే, చివరకు బోర్డు నిబంధనలకు తలొగ్గి క్షమాపణ కోరడం ద్వారా వివాదానికి ముగింపు పలికాడు.






