TG : అర్థరాత్రి ఉరుములు మెరుపులతో దంచికొట్టిన వర్షం

by Muthe.Rajitha |

తెలంగాణలోని పలు జిల్లాలో శనివారం అర్థరాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది.

TG : అర్థరాత్రి ఉరుములు మెరుపులతో దంచికొట్టిన వర్షం
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలోని పలు జిల్లాలో శనివారం అర్థరాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. కామారెడ్డి, సిరిసిల్ల, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మెదక్ వంటి ప్రాంతాల్లో భారీ వాన కురిసింది. నార్త్ హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాల్లో కూడా అక్కడక్కడా జల్లులు కురిసినట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. కాగా రానున్న మరో గంటలో మేడ్చల్, ఘట్‌కేసర్, యాదాద్రి, సిద్దిపేట, జనగాం, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, మంచిర్యాల, హన్మకొండ ప్రాంతాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురవడానికి అవకాశం ఉందని HMD పేర్కొంది. పలు జిల్లాలకు అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసారు. అలాగే హైదరాబాద్ లోని ఉప్పల్, లింగంపల్లి, కాప్రా, నాగోల్, వనస్థలిపురం, హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.

Next Story