- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్ లో ఉరుములతో కూడిన వర్షం
హైదరాబాద్ నగరంలో మంగళవారం సాయంత్రం ఉరుములతో కూడిన వర్షం పడింది.

దిశ, వెబ్ డెస్క్ : అకాల వర్షాలు రాష్ట్రాన్ని ముంచెత్తుతున్నాయి. మంగళవారం పలు జిల్లాల్లో భారీ ఈదురు గాలులు, వడగళ్లతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి.మేడ్చల్, సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. సంగారెడ్డి పట్టణం, ఇస్నాపూర్, పాశమైలారం, రుద్రారం, కంది, మరియు సదాశివపేటల్లో వడగళ్ళు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. హైదరాబాద్ మహానగరానికి సంబంధించి వాతావరణం మిశ్రమంగా ఉండబోతోంది. హైదరాబాద్ నగర శివారులోని పటాన్‌చెరు, మాదినగూడ, బాచుపల్లి ప్రాంతాల్లో ఉరుములతో కూడిన తేలికపాటి వాన పడింది. నగరంలోని మిగిలిన ప్రాంతాల్లో రాబోయే రెండు గంటల్లో ఉరుములతో కూడిన జల్లులు పడవచ్చని HMD పేర్కొంది. అలాగే రాత్రి వరకు మోస్తరు వర్షాలు మరియు ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ సమయంలో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నందున, ప్రయాణికులు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని GHMC సూచించింది.
అలాగే రాష్ట్రంలోని వికారాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, కామారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి, జనగామ, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో అర్థరాత్రి తీవ్రమైన ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, కొన్ని చోట్ల వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉంది. అలాగే ఖమ్మం, సిరిసిల్ల, వరంగల్, మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములతో కూడిన వర్షాలు పడవచ్చని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.






