- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సినిమా సీన్‌ను తలపించిన రౌడీల దాడి.. అడ్డుకుంటే ఎవరినైనా కొడతామంటూ హల్ చల్!
నిజాంపేట్‌లో రౌడీ మూకలు ఒక్కసారిగా హల్ చల్ చేశాయి.

దిశ, కుత్బుల్లాపూర్: నిజాంపేట్‌లో రౌడీ మూకలు ఒక్కసారిగా హల్ చల్ చేశాయి. రోడ్డు మీద పార్క్ చేసిన కారును తీయమని హారన్ కొట్టిన ఆటో డ్రైవర్ పై ఒక్కసారిగా విరుచుకుపడి మూకుమ్మడి దాడులు చేసి స్థానికంగా భయానక వాతావరణం సృష్టించిన ఘటన శుక్రవారం రాత్రి బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. స్థానికులు,ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. స్థానికంగా ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్న ఆటో డ్రైవర్ శంకర్ శుక్రవారం సాయంత్రం తన ఆటోలో శ్రీరామ్ కుంట పార్క్ రోడ్డు మీదుగా నిజాంపేట్‌కు వెళ్తున్నాడు. అదే సమయంలో కొందరు వ్యక్తులు రోడ్డుకు అడ్డంగా కారు పార్క్ చేశారు. దీంతో ఆటో డ్రైవర్ శంకర్ కారును పక్కకు తీయాలని హారన్ కొట్టాడు. ఆటో డ్రైవర్ హారన్ కొట్టడంతో రెచ్చిపోయిన కారుకు సంబంధించిన వ్యక్తులు ఒక్కసారిగా గుంపుగా పోగై ఆటో వాలా పై రాక్షస దాడికి తెగబడ్డారు.
‘ఏందిరా ఎక్కడి నుండో బతకడానికి వచ్చి మా కారే తీయమంటావా మేము లోకల్ రా’ అంటూ ఒక్కసారిగా రెచ్చిపోయి ఆటో డ్రైవర్ శంకర్ పై సుమారు ఆరుగురు రౌడీ మూకలు విక్షక్షణ రహితంగా దాడులకు తెగబడ్డారు. ఆటో డ్రైవర్ ఒక్కడిని చేసి అందరూ కలిసి దాడులు చేయడంతో శ్రీరాంకుంటలో వాకింగ్ చేస్తున్న పలువురు వ్యక్తులు అడ్డుకోబోయిన వారిని సైతం బెదిరించి దాడులకు పాల్పడ్డారు. దాడులు వద్దని అడ్డు చెప్పబోయిన వారిని, దాడుల ఘటన వీడియో, ఫొటోలు తీస్తున్న వ్యక్తులపై విరుచుకుపడ్డారు. దీంతో రోడ్డు మీద వెళ్లే వ్యక్తులు ప్రాణ భయంతో చూస్తూ ఉండి పోయారే తప్ప ఆటో డ్రైవర్ శంకర్ పై జరుగుతున్న దాడిని ఆపలేకపోయారు. అప్పుడే కొందరు వ్యక్తులు ప్రాణ భయంతో డయల్ 100కు ఫోన్ చేసి త్వరగా రావాలని వేడుకున్నప్పటికి.. బాచుపల్లి పోలీసులు సంఘటన స్థలానికి రావడానికి సుమారు 30 నిమిషాలు సమయం పట్టింది.
దీంతో రౌడీ మూకలు స్థానికులను చెల్లాచెదురు చేస్తూ, వద్దని వారించిన వారిపై దాడులు చేస్తూ ఆటో డ్రైవర్ శంకర్ ను స్పృహ తప్పి పడిపోయేలా మీద పడి రాక్షస దాడులు చేశారు. వద్దు మావాడిని కొట్టకండి అని కాళ్ల వేళ్ల పడి ప్రాధేయపడినా కనికరించలేదు. ఆటో డ్రైవర్ రౌడీల దాడిలో స్పృహ తప్పి పడిపోవడంతో చనిపోయాడని భావిస్తూ అక్కడి నుండి పారిపోయారు. ప్రాణాలను కాపాడాల్సిన బాచుపల్లి పోలీసులు తీరిక కుదిరినపవుడు సంఘటన స్థలానికి చేరుకొని ఆరా తీయడంతో స్థానికులు పోలీసుల స్పందనను తప్పు పడుతున్నారు. నిందితులను వీలైనంత త్వరగా గుర్తించి కఠినంగా శిక్షించాలని ప్రజలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.






