- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Prashna Ravan: పాయకరావుపేటలో ప్రశ్న రావణ్.. జనసేన నాయకుల ఆందోళన
బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ యూట్యూబర్ ప్రశ్న రావణ్‌ను అనకాపల్లి జిల్లా పాయకరావుపేట అడ్డురోడ్డు సర్కిల్ కార్యాలయానికి పోలీసులు తీసుకురావడంతో జనసేన నాయకులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకొని ఆందోళన చేపట్టారు.

దిశ, డైనమిక్ బ్యూరో: బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ యూట్యూబర్ ప్రశ్న రావణ్‌ను అనకాపల్లి జిల్లా పాయకరావుపేట అడ్డురోడ్డు సర్కిల్ కార్యాలయానికి పోలీసులు తీసుకురావడంతో జనసేన నాయకులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకొని ఆందోళన చేపట్టారు. ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై నమోదైన కేసులో మచిలీపట్నం ఇనగుదురుపేట పోలీసులు రావణ్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అయితే, జైలు నుంచి విడుదలైన వెంటనే మరో కేసులో అనకాపల్లి జిల్లా పాయకరావుపేట పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం తెలిసిన జనసేన నాయకులు సర్కిల్ కార్యాలయం వద్దకు చేరుకుని రావణ్‌కు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు.
కాగా, డిప్యూటీ సీఎంపై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో ప్రశ్న రావణ్‌ను ఇప్పటికే పలు మార్లు అరెస్ట్ చేశారు. మూడుసార్లు రావణ్ రిమాండ్‌ను రిజెక్ట్ చేసి.. న్యాయమూర్తులు బెయిల్ మంజూరు చేశారు. మరోవైపు ఏలూరులోనూ జనసేన నాయకుల ఫిర్యాదు మేరకు ప్రశ్న రావణ్‌పై కేసు నమోదైంది.






