- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అప్పుల పేరిట కాంగ్రెస్, బీఆర్ఎస్ డ్రామా.. రెండు పార్టీలపై బండి సంజయ్ ఫైర్
రాష్ట్రంలో గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు అప్పులు, అవినీతి, అక్రమాలు తప్ప చేసిందేమీ లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు అప్పులు, అవినీతి, అక్రమాలు తప్ప చేసిందేమీ లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఆయన.. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై నిప్పులు చెరిగారు. తెలంగాణలో జరుగుతున్న ప్రతి అభివృద్ధి పని వెనుక కేంద్ర ప్రభుత్వ నిధులే ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలకులు రాష్ట్రానికి చేసింది శూన్యమని విమర్శించారు. ఈ రెండు పార్టీలు కలిసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టాయని, ఏకంగా రూ.10 లక్షల కోట్ల అప్పులు చేసి ప్రజలపై తీవ్ర భారం మోపారని మండిపడ్డారు. ఇలాంటి నిర్లక్ష్యపు పాలన వల్ల తెలంగాణ భవిష్యత్తులో శ్రీలంక, పాకిస్తాన్ దేశాల తరహాలో ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ అప్పుల ఊబి నుండీ రాష్ట్రం బయటపడాలంటే తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
కేంద్ర నిధుల మళ్లింపు..
గ్రామాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం 14, 15వ ఆర్థిక సంఘం నిధులను నేరుగా కేటాయిస్తుంటే, ఇక్కడి పాలకులు ఆ నిధులను పంచాయతీ ఉద్యోగుల జీతాల కోసం డైవర్ట్ చేస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. కేంద్ర పథకాలపై కోర్టులకు వెళ్లడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. "వీబీజీ రామ్ జీ పథకంతో పనిదినాలు పెంచి, శాశ్వత ఆస్తులను సృష్టించడం తప్పా? దీనిపై కోర్టుకు వెళ్లడం ఏంది?" అని ప్రశ్నించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఎక్కడ మంచి పేరు వస్తుందోననే ఈర్ష్యతోనే ప్రతిపక్షాలు ఇలాంటి దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నాయని, మోడీ సంక్షేమ ఫలాలను ప్రజలు గమనిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.






