Priya Hegde: పేరుకే సీరియల్ హీరోయిన్.. గ్లామర్‌లో స్టార్ హీరోయిన్లకే గట్టి పోటీ

by Pulgam srinivas |

ప్రియా హెగ్డే అందాల ఆరబోత.. నేవీ బ్లూ చీరలో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది.

Priya Hegde: పేరుకే సీరియల్ హీరోయిన్.. గ్లామర్‌లో స్టార్ హీరోయిన్లకే గట్టి పోటీ
X

దిశ, వెబ్ డెస్క్: ఒకప్పుడు టెలివిజన్ సీరియల్స్‌లో నటించేందుకు హీరోయిన్లు పెద్దగా ఆసక్తి చూపించేవారు కాదు. అందుకు ప్రధాన కారణం.. సీరియల్స్‌లో నటించిన వారికి సినిమాల్లో ఆశించిన స్థాయిలో అవకాశాలు దక్కకపోవడమే. అయితే ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.




బుల్లితెరపై గుర్తింపు తెచ్చుకున్న ఎంతోమంది భామలు వెండితెరపై అవకాశాలు అందుకుని స్టార్ హీరోయిన్లుగా సత్తా చాటుతున్నారు. దీంతో ప్రస్తుతం అనేక మంది అందాల భామలు సీరియల్స్ వైపు అడుగులు వేస్తున్నారు. మరోవైపు, సీరియల్స్‌లో ఎంతో పద్ధతిగా కనిపించే హీరోయిన్లు సోషల్ మీడియాలో మాత్రం గ్లామర్ డోస్ పెంచుతూ అభిమానులను ఫిదా చేస్తున్నారు.




అలాంటి వారిలో ప్రియా హెగ్డే ఒకరు. ఇప్పటికే పలు సీరియల్స్‌లో నటించి బుల్లితెర ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్న ఈ బ్యూటీ, సోషల్ మీడియాలోనూ తన హాట్ ఫోటోషూట్లతో ఎప్పటికప్పుడు ఆకట్టుకుంటూ ఉంటుంది. తాజాగా ప్రియా హెగ్డే మరోసారి తన గ్లామర్ షోతో సోషల్ మీడియాను హీటెక్కించింది.




తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన తాజా ఫోటోల్లో గోల్డ్ బార్డర్‌తో కూడిన నేవీ బ్లూ చీరను ధరించి, దానికి మ్యాచింగ్ బ్లౌజ్‌లో ఎంతో స్టైలిష్‌గా మెరిసింది. చీర కొంగును స్టైలిష్‌గా సెట్ చేస్తూ తన అందాన్ని మరింత హైలైట్ చేసింది.




అంతేకాదు, మెడలో భారీ హారం, జడలో పూలు, ముఖంపై అందంగా జారిన కురులు, ఒక చేతికి నల్లటి గాజులతో ట్రెడిషనల్ లుక్‌కు గ్లామర్ టచ్ ఇచ్చింది. మొత్తంగా ఈ అవతారంలో ప్రియా హెగ్డే ఎంతో స్టన్నింగ్‌గా కనిపించడంతో, ఆమె తాజా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారి అభిమానుల నుంచి భారీ స్పందనను అందుకుంటున్నాయి.

Photos Courtesy: Instagram

Next Story