బాలికపై లైంగిక వేధింపులు.. స్కూల్ టీచర్ పై పోక్సో కేసు

by Ajay Maddhiboyina |

ఏపీలో దారుణం చోటు చేసుకుంది. మైన‌ర్ బాలిక‌పై ఓ స్కూల్ టీచ‌ర్ లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డ్డాడు. దీంతో అత‌డిని పోక్సో కేసు న‌మోదైంది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. కాకినాడ జిల్లా పిఠాపురంలో ప్ర‌స‌న్న కుమార్ అనే ఓ ప్రైవేట్ స్కూల్ టీచ‌ర్ అదే పాఠ‌శాల‌లో చ‌దువుతున్న బాలిక‌పై లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డ్డాడు.

బాలికపై లైంగిక వేధింపులు.. స్కూల్ టీచర్ పై పోక్సో కేసు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో దారుణం చోటు చేసుకుంది. మైన‌ర్ బాలిక‌పై ఓ స్కూల్ టీచ‌ర్ లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డ్డాడు. దీంతో అత‌డిని పోక్సో కేసు న‌మోదైంది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. కాకినాడ జిల్లా పిఠాపురంలో ప్ర‌స‌న్న కుమార్ అనే ఓ ప్రైవేట్ స్కూల్ టీచ‌ర్ అదే పాఠ‌శాల‌లో చ‌దువుతున్న బాలిక‌పై లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డ్డాడు. ఆ విష‌యం కాస్తా బాలిక త‌ల్లిదండ్రుల‌కు తెలియ‌డంతో పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకుని విచార‌ణ జ‌రిపిన పోలీసులు నిందితుడిపై పోక్స్ చ‌ట్టం కింద కేసు న‌మోదు చేశారు.

బాలిక‌ను లైంగికంగా వేధించ‌డంతో ఆమె తల్లిదండ్రులు, బంధువులు స్కూల్ వ‌ద్ద‌కు చేరుకుని ఆందోళ‌న చేప‌ట్టారు. నిందితుడిని క‌ఠినంగా శిక్షించాల‌ని డిమాండ్ చేశారు. స్కూల్ యాజ‌మాన్యంపై సైతం మండిప‌డ్డారు. యాజ‌మాన్యం విద్యార్థుల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అన్నారు. ఈ క్ర‌మంలో పోలీసులు బాధితుల‌కు న‌చ్చ‌జెప్పే ప్ర‌య‌త్నం చేశారు. నిందితుడిని క‌ఠినంగా శిక్షిస్తామ‌ని హామీ ఇచ్చారు. ఇదిలా ఉంటే మైనర్లపై లైంగిక వేధింపుల కేసుల్లో పోక్సో చట్టం కింద కఠిన శిక్షలు అమలు చేస్తున్నా మార్పురావడంలేదు. తరచూ ఎక్కడో ఒక చోట ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటూనే ఉంటున్నాయి.

Next Story