మమతా బెనర్జీకి మరో బిగ్ షాక్.. పార్టీ అధ్యక్షురాలు రాజీనామా

by Malleboina Mahesh |

టీఎంసీ రాష్ట్ర అధ్యక్షురాలు చంద్రిమా భట్టాచార్య పార్టీకీ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను మాజీ సీఎం మమతా బెనర్జీకి అందజేశారు.

మమతా బెనర్జీకి మరో బిగ్ షాక్.. పార్టీ అధ్యక్షురాలు రాజీనామా
X

దిశ, వెబ్ డెస్క్: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందిన ప్రభుత్వాన్ని కోల్పోయిన మమతా బెనర్జీ (Mamata Banerjee)కి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆ పార్టీకి రాజీనామా చేశారు. అలాగే మరికొంతమంది రెబల్ గా మారి పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితురాలు, పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు చంద్రిమా భట్టాచార్య (Chandrima Bhattacharya) రాజీనామా చేయడం సంచలనంగా మారింది. ఇప్పటికే తీవ్ర సంక్షోభంలో మునిగిపోయిన టీఎంసీకి పార్టీ ఆమె రాజీనామా గట్టి ఎదురుదెబ్బ గా మారింది. టీఎంసీ పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు చంద్రిమా భట్టాచార్య శనివారం (జూలై 4, 2026) రాజీనామా లేఖను మమతా బెనర్జీకి పంపించారు.

కుప్పకూలుతున్న తృణమూల్ కాంగ్రెస్..

ఇటీవల జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఓడిపోవడంతో మమతా బెనర్జీ పాత కమిటీలన్నింటినీ రద్దు చేసి, పార్టీని పునర్వ్యవస్థీకరించే క్రమంలో చంద్రిమా భట్టాచార్యను రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమించారు. అయితే పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలు, నేతల వలసల నేపథ్యంలో ఆమె పదవి చేపట్టిన కొద్ది రోజుల్లోనే చెప్పుకోవడం గమనార్హం. ఇప్పటికే టీఎంసీకి చెందిన 20 మంది లోక్‌సభ ఎంపీలు కాకోలి ఘోష్ దస్తీ దార్ నాయకత్వంలో తిరుగుబాటు జెండా ఎగురవేసి, నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీలో విలీనమై ఎన్డీఏ (NDA) కూటమికి మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. అసెంబ్లీలోనూ సుమారు 60 మంది ఎమ్మెల్యేలు విడిగా గ్రూపుగా ఏర్పడటంతో బెంగాల్‌లో మమతా బెనర్జీ రాజకీయ భవిష్యత్తు అత్యంత క్లిష్టతరంగా మారింది. తాజాగా చంద్రిమ రాజీనామాతో టీఎంసీ పార్టీ ఉనికి మరింత సంక్షోభంలో పడింది.

Next Story