- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఎమ్మెల్యేకు వినతి
అర్హులైన జర్నలిస్టులందరికి ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డికి ఆయన స్వగృహంలో శనివారం నిర్మల్ జిల్లా TSJU సభ్యులు కలిసి వినతిపత్రం అందజేశారు.

దిశ, నిర్మల్: అర్హులైన జర్నలిస్టులందరికి ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డికి ఆయన స్వగృహంలో శనివారం నిర్మల్ జిల్లా TSJU సభ్యులు కలిసి వినతిపత్రం అందజేశారు. అందుకు ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సానుకూలంగా స్పందించారని తెలిపారు. నిర్మల్ జిల్లా TSJU సంఘ సభ్యులు మాట్లాడుతూ జిల్లాలోని అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని, గత 20 సంవత్సరాలుగా పాత్రికేయ రంగంలో పనిచేస్తున్నప్పటికీ, ఏ ఒక్కరికి కూడా ఇళ్ల స్థలాలు ఇప్పటివరకు ఇవ్వడం లేదని అన్నారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటు, ప్రజా సమస్యలే పరిష్కారం దిశగా పనిచేస్తున్న జర్నలిస్టులను ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని అన్నారు.
అలాగే జర్నలిస్టులకు ప్రమాద బీమా రూ.10 లక్షల వరకు ప్రభుత్వం అందజేయాలని కోరారు. తమ హక్కుల కోసం ఎన్నో సంవత్సరాల నుండి పోరాడుతున్నప్పటికీ సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి అర్హులైన జర్నలిస్టులందరికీ, ఇళ్ల స్థలాలు మంజూరు చేయించాలని కోరారు. లేనియెడల రాష్ట్రవ్యాప్తంగా తమ పోరాటాలను కొనసాగిస్తామని TSJU నిర్మల్ జిల్లా కమిటీ సభ్యులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో TSJU జిల్లా అధ్యక్షుడు రమేష్ శర్మ, ఉపాధ్యక్షుడు సురేష్, ప్రధాన కార్యదర్శి రాహుల్ గౌడ్, కోశాధికారి మందుల భీమేష్ తో పాటు నిర్మల్, లక్ష్మణచందా కమిటీ సభ్యులు మహేందర్, రాజేందర్ పాల్గొన్నారు.






