గొల్లపూడి జీపీఓ పై అవినీతి ఆరోపణలు

by Batti.Sumithra |

వైరా మండలంలోని గొల్లపూడి గ్రామ పాలన అధికారి పై అనేక అవినీతి ఆరోపణలు చోటు చేసుకున్నాయి.

గొల్లపూడి జీపీఓ పై అవినీతి ఆరోపణలు
X

దిశ, వైరా : వైరా మండలంలోని గొల్లపూడి గ్రామ పాలన అధికారి పై అనేక అవినీతి ఆరోపణలు చోటు చేసుకున్నాయి. ప్రజలు ఆన్లైన్లో చేసుకున్న దరఖాస్తులను ధ్రువీకరించటంలో జీపీఓ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. అంతేకాకుండా ప్రతి పనికి కాసులు వసూలు చేస్తుందని గ్రామంలోని కొంతమంది ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల గ్రామానికి చెందిన కొంతమంది ఆధారాలతో జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.

దీంతో శుక్రవారం వైరా తహసీల్దార్ కార్యాలయంలో ఖమ్మం ఆర్డీవో ఎన్ శ్రీనివాసరావు విచారణ నిర్వహించారు. ఆర్డీవో విచారణ నివేదిక ఆధారంగా జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అయితే ఆ జీపీఓ పై అనేక ఆరోపణలు రావటంతో గొల్లపూడి నుంచి బదిలీ చేస్తారనే ప్రచారం జరుగుతుంది. అదేవిధంగా వైరాలో పనిచేస్తున్న జీపీఓ పై కూడా నిరంతరం ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఆయన పనితీరును మార్చుకోవాలని అధికారులు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.

Next Story