- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సౌత్ కొరియా పర్యటనకు మంత్రి నారా లోకేష్
by Naga Rani Yarlagadda |
తమ దేశంలో పర్యటించేందుకు రావాలని పేర్కొంటూ ఏపీ ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు సౌత్ కొరియా ఆహ్వానం పలికింది.

X
దిశ, వెబ్‌డెస్క్: తమ దేశంలో పర్యటించేందుకు రావాలని పేర్కొంటూ ఏపీ ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు సౌత్ కొరియా ఆహ్వానం పలికింది. దీంతో ఆయన దక్షిణ కొరియా పర్యటనకు పయనమవ్వనున్నారు. జులై 5వ తేదీ నుంచి 11వ తేదీ వరకూ.. వారంరోజులపాటు మంత్రి లోకేష్ సౌత్ కొరియాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో అధికారిక సమావేశాలతో పాటు.. రాష్ట్రంలో పెట్టుబడులపై కూడా చర్చించనున్నారు. సౌత్ కొరియా రాజధాని సియోల్ కేంద్రంగా పలు గ్లోబల్ కంపెనీల అధినేతలతో ఆయన భేటీ అవ్వనున్నట్లు సమాచారం.
ఈ పర్యటనకు ముందు జూన్ 2026 లో ఢిల్లీలో భారత దక్షిణ కొరియా రాయబారి 'లీ సియోంగ్ హో'తో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. ఆ చర్చల కొనసాగింపుగానే, ఇప్పుడు నేరుగా దక్షిణ కొరియా వేదికగా ఏపీకి పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా ఈ 7 రోజుల పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
Next Story






