- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్వల్పకాలిక పంటలతో లాభాలు: వ్యవసాయాధికారి సోమలింగారెడ్డి
స్వల్ప కాలిక పంటలపై రైతులు మొగ్గు చూపుతున్నారు.

దిశ, నిజాంపేట: స్వల్ప కాలిక పంటలపై రైతులు మొగ్గు చూపుతున్నారు. అనుకున్న రీతిలో వర్షాలు లేకపోవడం వల్ల వరి సాగు కంటే.. స్వల్పకాలిక పంటలే.. లాభదాయకమనే ఆలోచనలో రైతులు పడ్డారు. నిజాంపేట మండల వ్యాప్తంగా సుమారు 625 ఎకరాల్లో రైతులు మొక్క జొన్న పంటలు వేశారు. ఎక్కువ శాతం రైతులు వరి పంటపై ఆశలు వదులుకున్నారు. రోహిణి, కార్తె, ఆరుద్ర ముగిస్తున్నప్పటికీ వర్షాలు లేకపోవడం వల్ల కర్షకులు ఆందోళనకు గురవుతున్నారు. అధికారులు చెప్పిన విధంగా.. స్వల్ప కాలిక పంటలు వేసినట్లయితే లాభం ఉంటుందన్న ఉద్దేశంతో వాటిపై ముగ్గు చూపుతున్నారు. నిజాంపేట, బచ్చురాజు పల్లి, రజాక్ పల్లి, చల్మెడ, నస్కల్, తిప్పనగుళ్ళ గ్రామాల్లో రైతులు అధికంగా మొక్కజొన్న, కందులు, కూరగాయలు పంటలు వేశారు. వరి పంట సంవత్సర కాలం లో రెండు పంటలు దిగుమతి జరుగుతుందని, మొక్క జొన్న సంవత్సరంలో మూడు పంటలు తీయొచ్చు, కందులు సంవత్సరం లో రెండు పంటలు దిగుమతి ఉంటుంది.
వరి పంట క్వింటాల్‌కు రూ.2,441, మొక్కజొన్న రూ.2,410, కందులు రూ.8,450 ఉండడంతో రైతులు వీటిపై ఆసక్తి చూపుతున్నారు. పెట్టుబడి వరి పంటతో పోల్చుకుంటే.. స్వల్పకాలిక పంటలకు తక్కువగా ఉంటుందని అంటున్నారు. ఇప్పటికే గ్రామాల్లో.. చెరువులు, కుంటలు నిండుగా లేకపోవడం వల్ల వరి పంట పై ఆశను వదులుకున్నట్టు తెలుస్తుంది. ఈ వర్షాకాలం అధిక వర్షాలు కురుస్తాయని ఆకాంక్షించిన రైతన్నకు, నిరాశే.. మిగులుస్తుందని పలువురు రైతులు అంటున్నారు. ఏదేమైనప్పటికీ ఈ వర్షాకాలం అధిక శాతం మంది రైతులకు స్వల్పకాలిక పంటలపై మొగ్గు చూపుతున్నట్టు స్పష్టమవుతుంది.
స్వల్ప కాలిక పంటలపై రైతులకు ఎప్పటికప్పుడు రైతు వేదికలలో సమావేశం ఏర్పాటు చేసి, స్వల్పకాలిక పంటల ద్వారా లాభాలను ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తున్నామని మండల వ్యవసాయాధికారి సోమలింగారెడ్డి అన్నారు. గ్రామస్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేసి, ఏ కాలంలో ఏ పంట వేయాలి అనే దానిపై కూడా అవగాహన కల్పిస్తున్నాం. చెరువులు కుంటలు నిండుగా లేకపోవడం వల్ల రైతులు స్వల్ప కాలిక పంటలపై మొగ్గు చూపిస్తున్నారని తెలిపారు. ఇప్పటికే చాలా గ్రామాల్లో.. రైతులు మొక్కజొన్న పంటలు వేశారు. తక్కువ నీటితో.. ఎక్కువ లాభాలు ఇచ్చే పంటలనే వెయ్యాలని రైతులకు సూచిస్తున్నామని తెలిపారు.






