- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళ దారుణ హత్య
by Jakkula.Mamatha |
ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిలకనగర్ ఆదర్శ్ నగర్‌లో ఒక మహిళ హత్యకు గురైన ఘటన చోటుచేసుకుంది.

X
దిశ, ఉప్పల్: ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిలకనగర్ ఆదర్శ్ నగర్‌లో ఒక మహిళ హత్యకు గురైన ఘటన చోటుచేసుకుంది. ప్రాథమిక వివరాల ప్రకారం.. గత నాలుగు సంవత్సరాలుగా సురేష్, జెస్సికా దంపతులు ఆదర్శ్ నగర్‌లో నివాసం ఉంటున్నారు. సురేష్ క్యాబ్ సూపర్వైజర్‌గా, జెస్సికా నర్సుగా పనిచేస్తున్నారు. భార్యపై అనుమానంతో భర్త సురేష్ హత్యకు పాల్పడినట్లు సమాచారం. హత్య అనంతరం నిందితుడు సురేష్ అక్కడి నుంచి పరారైనట్లు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. నిందితుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
Next Story






