- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇంగ్లండ్‌తో రెండో టీ20.. రేసులోకి 15 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీ
ఇంగ్లండ్‌తో నేడు రెండో టీ20.. సంజు శాంసన్, తిలక్ వర్మ ఫామ్‌పై తీవ్ర ఒత్తిడి.. 15 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీ అరంగేట్రంపై ఉత్కంఠ.

దిశ, వెబ్ డెస్క్: భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు టీ20ల సిరీస్ (T20 series) జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నేడు రెండో టీ20 మ్యాచ్ సాయంత్రం 6 గంటలకు మాంచెస్టర్ వేదికగా జరగనుంది. కాగా ఈ మ్యాచులో యువ సంచలనం 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) ని జట్టులోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సిరీస్‌లో టీమిండియా సీనియర్ ఆటగాళ్లు సంజు శాంసన్, తెలుగు కుర్రాడు తిలక్ వర్మల ఫామ్‌పై తీవ్రమైన ఒత్తిడి నెలకొంది. ఐర్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో వరసగా వైఫల్యాలు చవిచూసిన సంజు శాంసన్ నిలకడ లేమితో సతమతమవుతుండగా, మరోవైపు తిలక్ వర్మ నెమ్మదైన బ్యాటింగ్ శైలి కూడా జట్టు వేగాన్ని దెబ్బతీస్తోందంటూ మాజీల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ తరఫున విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో దూసుకొచ్చిన 15 ఏళ్ల బీహార్ యువ సంచలనం, భారత అండర్-19 ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రం (Debut) కోసం గట్టి డిమాండ్ వినిపిస్తోంది. ఒకవేళ సంజు శాంసన్‌ను మేనేజ్‌మెంట్ పక్కనబెడితే, ఇషాన్ కిషన్ వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపట్టి, వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో ఓపెనర్‌గా అవకాశం దక్కే ఛాన్స్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, అభిషేక్ శర్మ, శివమ్ దూబేలు సూపర్ ఫామ్‌లో ఉండటం జట్టుకు సానుకూలాంశం కాగా.. ఒత్తిడిలో ఉన్న సంజు, తిలక్ వర్మలను కొనసాగిస్తారా లేక యువ సంచలనం వైభవ్‌కు అవకాశం ఇస్తారా అనేది కొద్ది గంటల్లో తేలనుంది.






