సుర్ధాపూర్‌లో అటవీ భూముల పేరిట 150 హెక్టార్ల భూమి స్వాధీనం

by Jakkula.Mamatha |

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని దేవుడు పల్లి బీట్ సూర్ధపూర్ గ్రామ శివారులో అటవీ భూముల పేరిట 150 హెక్టార్ల భూమిని అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

సుర్ధాపూర్‌లో అటవీ భూముల పేరిట 150 హెక్టార్ల భూమి స్వాధీనం
X

దిశ, ఆసిఫాబాద్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని దేవుడు పల్లి బీట్ సూర్ధపూర్ గ్రామ శివారులో అటవీ భూముల పేరిట 150 హెక్టార్ల భూమిని అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల జూన్ 16న ఆ భూముల్లో జేసీబీతో ట్రెంచ్ వేసేందుకు అటవీశాఖ అధికారులు వెళ్తే..! భూములను సాగు చేస్తుకుంటున్న స్థానిక రైతులు వారి అడ్డుకున్నారు. దీంతో అప్పట్లో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదంతో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. అప్పుడు వెనుదిరిగి ఫారెస్ట్ అధికారులు ఇప్పుడు మళ్లీ శనివారం ఉదయం భారీ పోలీసుల భద్రతల మధ్య ట్రెంచ్ వేసేందుకు జేసీబీలో ఫారెస్ట్ అధికారులు తవ్వకాలు చేపట్టారు. ఇటీవల రైతులు అడ్డుకున్న నేపథ్యంలో వారిని భూముల వద్ద రానివ్వకుండా ఫారెస్ట్ అధికారులు ముందుస్తు పోలీసులు భద్రతా ఏర్పాటు చేశారు. తాత ముత్తాత కాలం నుంచి సాగు చేసుకుంటున్న భూములను లాక్కోని తమ అన్యాయం చేయొద్దని రైతులు వేడుకుంటున్నారు.

Next Story