- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మరోసారి భద్రకాళి ఆలయం వద్ద ఉద్రిక్తత
వరంగల్ భద్రకాళీ ఆలయం వేదికగా శుక్రవారం జరిగిన వివాదం మరోసారి రాజుకుంది.

దిశ, వెబ్ డెస్క్ : వరంగల్ భద్రకాళీ ఆలయం వేదికగా శుక్రవారం జరిగిన వివాదం మరోసారి రాజుకుంది. రాజకీయ సవాళ్లు, ఆరోపణల కోసం బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు పవిత్రమైన భద్రకాళీ దేవాలయాన్ని వాడుకోవడంపై బీజేపీ శ్రేణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. తడిబట్టలతో వచ్చి ఆలయ పవిత్రతను దెబ్బతీశారంటూ బీజేపీ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. రాజకీయ డ్రామాలకు దేవాలయాన్ని వేదిక చేయవద్దని డిమాండ్ చేస్తూ, ఆలయాన్ని రాజకీయాలతో అపవిత్రం చేశారని మండిపడ్డారు. ఈ క్రమంలో ఆలయ పరిసరాలను శుద్ధి చేయాలంటూ నిరసనకు దిగిన బీజేపీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు పలువురు బీజేపీ నేతలను బలవంతంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రస్తుతం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో, ఈ భూముల వ్యవహారం ప్రధాన రాజకీయ అస్త్రంగా మారింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రకాళి ఆలయ పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసు బలగాలను మోహరించారు.






