విక్కీతో కత్రినా పెళ్లి.. బ్యూటీ సినిమాలకు గుడ్ బై చెప్పనుందా..?

by Dishanational2 |
విక్కీతో కత్రినా పెళ్లి.. బ్యూటీ సినిమాలకు గుడ్ బై చెప్పనుందా..?
X

దిశ, సినిమా : బ్యూటిఫుల్ కత్రినా కైఫ్.. విక్కీ కౌశల్‌‌తో పెళ్లి తర్వాత హ్యాపీగా ఉంది. ఎప్పటికప్పుడు ఫొటోస్ ద్వారా అభిమానులతో ఈ విషయాన్ని పంచుకుంటున్న భామ.. సినిమాలపై కూడా ఫోకస్ చేస్తోంది. ప్రస్తుతం మాజీ బాయ్ ఫ్రెండ్ సల్మాన్ ఖాన్‌తో 'టైగర్ 3' సీక్వెల్‌కు వర్క్ చేస్తున్న అమ్మడు.. భారీ యాక్షన్ సీన్స్‌కు ప్రిపేర్ అవుతోంది. అయితే గతంలో 'నమస్తే లండన్' సినిమా ఫెయిల్ అయితే.. ఇండస్ట్రీ నుంచి క్విట్ అయిపోవాలని అనుకుందట కత్రినా. కచ్చితంగా మూటాముళ్లె సర్దేసుకోవాల్సిందే అనుకుందట. కానీ అనుకోని విధంగా మూవీ క్రిటికల్లీ, కమర్షియల్లీ హిట్ కావడంతో.. మరో పని వెతుక్కునే పనిలేకుండా పోయిందని 'కాఫీ విత్ కరణ్ షో'లో వెల్లడించింది మిసెస్ కౌశల్.



Next Story

Most Viewed