ఇంట్లో గ్యాస్ లీకేజి.. ముగ్గురికి తీవ్ర గాయాలు

by Batti.Sumithra |

ఓ ఇంట్లో గ్యాస్ లీక్ కావడంతో మంటలు చిలరేగాయి.

ఇంట్లో గ్యాస్ లీకేజి.. ముగ్గురికి తీవ్ర గాయాలు
X

దిశ, కామారెడ్డి : ఓ ఇంట్లో గ్యాస్ లీక్ కావడంతో మంటలు చిలరేగాయి.. దీంతో మంటల ధాటికి ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కాగా సిలిండర్ పేలకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన కామారెడ్డి పట్టణంలోని వినాయక నగర్ కాలనీలో బుధవారం చోటుచేసుకుంది. ఇంట్లో వంట గ్యాస్ లీకవడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో మంటలను ఆర్పుతుండగా మల్లవ్వ, మౌనిక, అలేఖ్య అనే ముగ్గురికి గాయాలయ్యాయి. దీంతో స్థానికులు గమనించి వారిని బయటకు తీసుకువచ్చారు. విషయాన్ని తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. కాగా గాయపడిన వారిని కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వారు చికిత్స పొందుతున్నారు. కాగా గ్యాస్ లీకైనప్పుడు సిలిండర్ పేలి ఉంటే పెను ప్రమాదం సంభవించేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.

Next Story