- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జలపాతంలో పడి ముగ్గురు విద్యార్థినులు మృతి
పరీక్షలు ముగిసి సరదాగా ఎంజాయ్ చేద్దామనుకున్న ముగ్గురు బాలికల జీవితం విషాదాంతం అయింది.

దిశ, వెబ్ డెస్క్ : పరీక్షలు ముగిసి సరదాగా ఎంజాయ్ చేద్దామనుకున్న ముగ్గురు బాలికల జీవితం విషాదాంతం అయింది. అల్లూరి ఏపీలోని సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం జంబువలస గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ముల బిడ్డలు త్రిష (17), రత్నకుమారి (16), పవిత్ర (16) తమ స్నేహితురాలు అంజలితో కలిసి సరదాగా సమయాన్ని గడపాలని అనంతగిరి మండలంలోని మలుంగుమ్మి జలపాతం వద్దకు వెళ్లారు. ఇంటర్ పరీక్షలు ముగించుకుని సెలవులకు ఇంటికి వచ్చిన త్రిషతో కలిసి మిగిలిన వారు జలపాతం అందాలను ఫొటోలు, వీడియోలు తీసుకోవాలని ఉత్సాహపడ్డారు. అయితే, ఆ ఉత్సాహమే వారి ప్రాణాల మీదకు వస్తుందని వారు ఊహించలేకపోయారు. జలపాతం అంచున నిలబడి సెల్ఫీలు తీసుకుంటున్న క్రమంలో రాళ్లు జారి ఒక యువతి ప్రమాదవశాత్తూ నీటి ప్రవాహంలో పడిపోయింది.
ఆమెను రక్షించే ప్రయత్నంలో ఒకరినొకరు పట్టుకోబోయి మిగిలిన ముగ్గురు కూడా లోతైన గెడ్డలో జారిపడిపోయారు. స్థానికులు వెంటనే స్పందించి వారిని నీటి నుంచి బయటకు తీసినప్పటికీ, అప్పటికే త్రిష, రత్నకుమారి, పవిత్ర నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. అదృష్టవశాత్తూ అంజలి గాయాలతో బయటపడగలిగింది. ఒకే గ్రామంలో, అది కూడా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆడబిడ్డలు విగతజీవులుగా పడి ఉండటం చూసి ఆ గ్రామం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు.






