రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి

by Disha Web |
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి
X

దిశ,ఉత్తరాంద్ర : విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం గౌరీపురం వద్ద ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మోటారు సైకిల్ని కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు మృతి చెందగా వారి తల్లిదండ్రులు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉండటంతో శృంగవరపుకోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులు విశాఖలోని శివలింగపురానికి చెందిన మృతులు.. శ్రావణ్(7) సుహాస్(8) గా గుర్తించారు. జరిగిన ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చిన్నారులు ఇద్దరు మృతి చెందిన ఘటనను చూసిన స్థానికులు కన్నీటి పర్యంతమయ్యారు.

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed