ఎంపీని బెదిరించి రూ.10 కోట్లు డిమాండ్

by Muthe.Rajitha |

నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

ఎంపీని బెదిరించి రూ.10 కోట్లు డిమాండ్
X

దిశ, వెబ్ డెస్క్ : ఏలూరు ఎంపీ పుట్టా మహేష్‌తో పాటు ఆయన తండ్రి, మైదుకూరు ఎమ్మెల్యే సుధాకర్‌ యాదవ్‌ను బెదిరించిన కేసులో ముంబయికి చెందిన రుషాంత్‌ జయకుమార్‌ వాడ్కే అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఆర్టీఐ కార్యకర్తనని చెప్పుకుంటూ ఈ-మెయిల్స్‌ ద్వారా ఎంపీకి బెదిరింపులు పంపిన నిందితుడు, మీ ఆస్తుల వివరాలు బయటపెడతానని, రూ.10 కోట్లు ఇస్తే వదిలేస్తానని, లేకపోతే CBI, ED కి ఫిర్యాదు చేస్తానని బెదిరించాడు. ఈ క్రమంలో ఎంపీ సూచన మేరకు ఎమ్మెల్యే పీఏ ఆది నిందితుడితో మాట్లాడేందుకు ప్రయత్నించగా.. మైదుకూరు వచ్చిన నిందితుడు ఆదిని కత్తితో బెదిరించి రూ.70 వేలు దోచుకుని పారిపోయాడని ఫిర్యాదు అందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.

Next Story