ఇండస్ట్రీ టాప్ హీరోయిన్స్‌గా ఆ ఇద్దరు.. పోటిలో లేని Samantha

by Disha Web Desk 12 |
ఇండస్ట్రీ టాప్ హీరోయిన్స్‌గా ఆ ఇద్దరు.. పోటిలో లేని Samantha
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగు సినీ పరిశ్రమలో పెద్ద హీరోలందరితో జతకట్టిన సమంత కు ప్రసుత్తం లాంగ్ బ్రేక్ పడింది అని చెప్పాలి. ఒక్కపుడు ఏ మూవీ లో చూసిన ప్రతి హీరో పక్కన కనిపించిన సామ్ కొంత కాలంగా మూవీ లో కనిపించడం పూర్తిగా తగ్గింది అని చెప్పాలి. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో టాప్‌లో పూజ హెగ్డే, రష్మిక ముందున్నారు. వీరిద్దరూ పెద్ద హీరోలతో నటిస్తూ టాప్ పొజిషన్‌లో కొనసాగుతున్నారు. పూజ హెగ్డే ప్రభాస్ తో రాధే శ్యామ్ తర్వాత హిందీ, తమిళ , చిత్రాల్లో బిజీగా ఉంది. హీరో విజమ్ తో బీస్ట్ విడుదలకు సిద్ధం కాగా.. హిందీలో సల్మాన్ ఖాన్ తో "కబీ ఈద్ కబీ" అలాగే రణబీర్ కపూర్ తో సహా మొతం 3 బాలీవుడ్ సినిమా తో రెడీ గా ఉంది.

ఇక రష్మీక పాన్ ఇండియా మూవీ పుష్ప విడుదల తర్వాత.. వరస సినిమాలతో బిజీ అయిపొయింది. ఈ బ్యూటీ ప్రస్తుతం హిందీలో అమితా బచ్చన్ తో, సిద్దార్ధ్ మల్హోత్రా తో, రణబీర్ కపూర్ తో నటిస్తూ.. మొత్తంశ మూడు సినిమాలతో రెడీగా ఉంది. ఈ పరంగా చూస్తే సమంత చేతిలో యశోద తదితర మూవీలు ఉన్నప్పటికి పెద్ద హీరోలతో చెప్పుకోదగ్గ ఆఫర్‌లు లేవు. అందులో తమిళ్ లో విజమ్ సేతుపతి తో, విజయ్ దేవరకొండతో నటించనుంది. కానీ టాప్ హీరోలతో సామ్‌కి ఎలాంటి ఆఫర్ లు రావడం లేదు. వరుస సినిమాలతో టాప్ లో రష్మిక , పూజా బిజీ గా ఉండగా. సామ్ వెనుక పడింది అని చెప్పుకోవచ్చు. ఈ పరిస్థితుల నుంచి బయటపడి తన మొదటి స్థానాన్ని అందుకో గలదేమో వేచిచూాడాల్సిందే.


Next Story