అమ్మవారి బోనాలకు తొర్రూరు సిద్ధం

by Ratna Kumari |

అమ్మవారి బోనాల మహోత్సవాన్ని ఈ ఏడాది ఆగస్టు 5వ తేదీ బుధవారం సంప్రదాయబద్ధంగా, వైభవంగా నిర్వహించాలని మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయించారు.

అమ్మవారి బోనాలకు తొర్రూరు సిద్ధం
X

దిశ, తొర్రూరు : తొర్రూరు పట్టణంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే అమ్మవారి బోనాల మహోత్సవాన్ని ఈ ఏడాది ఆగస్టు 5వ తేదీ బుధవారం సంప్రదాయబద్ధంగా, వైభవంగా నిర్వహించాలని మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయించారు. మున్సిపల్ చైర్‌పర్సన్ తూనం శ్రావణ్ కుమార్ అధ్యక్షతన, మున్సిపల్ కమిషనర్ శ్యాంసుందర్, కౌన్సిల్ సభ్యులు, స్థానిక పండితుల సమక్షంలో గురువారం సమావేశం నిర్వహించారు. సమావేశంలో స్థానిక పండితులు సూచించిన కార్తె ప్రకారం ఆగస్టు 5న బోనాల మహోత్సవం నిర్వహించడం శుభప్రదమని నిర్ణయించి, వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లపై విస్తృతంగా చర్చించారు. ఆలయాల పరిసరాల్లో పారిశుద్ధ్యం, తాగునీటి సౌకర్యం, విద్యుత్ సరఫరా, ట్రాఫిక్ నియంత్రణతో పాటు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖల సమన్వయంతో చర్యలు చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు.

ఈ సందర్భంగా మున్సిపల్ చైర్‌పర్సన్ తూనం శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ.. తొర్రూరు బోనాల మహోత్సవానికి ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. ఈ వేడుకలను విజయవంతం చేయడానికి పట్టణ ప్రజలు, భక్తులు, యువత, మహిళలు స్వచ్ఛందంగా భాగస్వాములై పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ శ్యాంసుందర్, కౌన్సిలర్లు తూర్పాటి రవి, మాడ్గూల భవానీలత, కిన్నెర కవిత, ముద్దసాని సురేష్, కర్నే నాగరాజు, ధరవత్ పద్మ, స్థానిక ప్రముఖులు సోమ రాజశేఖర్, భూసాని ఉప్పలయ్య, బసనబోయిన రాజేష్, చకిలేల మణిరాజ్ త‌దితరులు పాల్గొన్నారు.

Next Story