- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మున్సిపాలిటీల్లో ప్రాపర్టీ ట్యాక్స్ రూ.685 కోట్లు కలెక్షన్
తెలంగాణలో రూ. 685 కోట్ల ఆస్తి పన్ను వసూలు! గతేడాది కంటే రూ. 68 కోట్లు అదనం. ఏప్రిల్ 30లోపు పన్ను చెల్లిస్తే 5% రాయితీ ఇస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడి.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ప్రధాన ఆదాయ వనరైన ఆస్తి పన్నుపై పురపాలకశాఖలో కమిషనర్ అండ్ డైరెక్టరేట్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్(సీడీఎంఏ) ఫోకస్ పెట్టింది. దీంతో గత ఏడాది కంటే ఈసారి రూ.68 కోట్లు ఎక్కువగా వసూలైంది. 2024-25 లో డిమాండ్ రూ.1,011కోట్లకుగాను రూ.617 కోట్లు రాగా.. 2025-26 లో రూ.1,179 కోట్లకుగాను రూ.685 కోట్లు వచ్చింది. జమ్మికుంట, హుజురాబాద్ మున్సిపాలిటీల్లో 100శాతం వసూలైంది.
గతేడాది కంటే ఈసారి 64 యూఎల్బీల్లో ప్రాపర్టీ ట్యాక్స్ పెరిగిందని అధికారులు చెబుతున్నారు. దీంతోపాటు గతేడాది 42 యూఎల్బీల్లో 80శాతానికి పైగా కలెక్షన్ వచ్చింది. ఈసారి మాత్రం 24 యూఎల్బీల్లో 80శాతం దాటిందని తెలిపారు. 90 మున్సిపాలిటీల్లో 50 శాతానికి కంటే ఎక్కువగా వసూలైందని, కొత్తగా ఏర్పడిన 21 మున్సిపాలిటీలకు గాను 16 మున్సిపాలిటీల్లో గతం కంటే ప్రాపర్టీ కలెక్షన్ పెరిగిందని వెల్లడించారు.
133 యూఎల్బీలు
రాష్ట్రంలో 12 మున్సిపల్ కార్పొరేషన్లు, 121 మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటిలో జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీలను మినహాయిస్తే సీడీఎంఏ పరిధిలో 130 పట్టణ స్థానిక సంస్థలు ఉన్నాయి. వీటిలో సుమారు 20లక్షల అసెస్‌మెంట్స్ ఉన్నాయి. అయితే 2024-25 ఆర్థిక సంవత్సరంలో జీహెచ్ఎంసీలో విలీనమైన 27 మున్సిపాలిటీలతో కలిపి రూ.1057 కోట్ల ఆస్తి పన్ను వసూలైంది. అయితే టార్గెట్ రూ.1500 కోట్లు పెట్టుకుంటే రూ.1057 వసూలు చేశారు. ఈసారి 133యూఎల్బీల్లో రూ.1,179 కోట్ల డిమాండ్ ఉంటే రూ.685కోట్లు వసూలైంది. జీహెచ్ఎంసీలో విలీనం చేసిన 27యూఎల్బీల్లో సుమారు రూ.500కోట్ల ట్యాక్స్ వసూలైంది.
వరంగల్ టాప్
ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్లలో అత్యధికంగా వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌లో రూ.91.23కోట్లు వసూలైంది. కొత్తగుడెం మున్సిపల్ కార్పొరేషన్ లో రూ.8.66కోట్లు మాత్రమే వసూలైంది. అయితే వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మంచిర్యాల, రామగుండం, నిజామాబాద్ కార్పొరేషన్లలో గతం కంటే ఈసారి కలెక్షన్ పెరిగింది. మహబుబ్ నగర్, కొత్తగూడెం, నల్గొండ కార్పొరేషన్లలో గతం కంటే కలెక్షన్ తగ్గింది.
ఎర్లీబర్డ్‌పై ఫోకస్..
రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఎర్లీబర్డ్ స్కీమ్‌పై ఫోకస్ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్లలో వెనుకబడినవారంతా ఎర్లీబర్డ్‌ను వినియోగించాలని కమిషనర్ టీకే.శ్రీదేవి సూచించినట్లు తెలిసింది. ఈసారి కూడా ఆశించిన స్థాయిలో వసూలు చేయకుంటే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరికలు కూడా జారీ చేసినట్లు తెలిసింది.






