- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాజ్యాంగ విలువల పునరంకితానికి ఇది తరుణం: ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్
భారతదేశం 77 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ దేశ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

దిశ, వెబ్ డెస్క్: భారతదేశం 77 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ (Vice President C.P. Radhakrishnan) దేశ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి కాలాతీత ఆదర్శాలపై నిర్మితమైన మన శక్తివంతమైన గణతంత్రాన్ని ఉత్సవంగా జరుపుకోవడానికి ఇది ఒక గొప్ప సందర్భమని ఆయన పేర్కొన్నారు. జనవరి 26 కేవలం రాజ్యాంగ నిర్మాతల దూరదృష్టికి నివాళి మాత్రమే కాదని, రాజ్యాంగం కల్పించిన ప్రజాస్వామ్య విలువలను కాపాడటంలో పౌరుల విధులు, బాధ్యతలను పునరుద్ఘాటించే పవిత్రమైన రోజని ఉపరాష్ట్రపతి అభివర్ణించారు.
వివిధ రంగాల్లో దేశం సాధిస్తున్న అద్భుత విజయాలు మన వ్యవస్థల బలానికి, ప్రజల అంకితభావానికి నిదర్శనమని ఉపరాష్ట్రపతి కొనియాడారు. 'వికసిత భారత్@2047' దిశగా సాగుతున్న మన ప్రయాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ గణతంత్ర దినోత్సవం మనలో ఐక్యతను పెంపొందించాలని, సమ్మిళితత్వాన్ని ప్రోత్సహించాలని, మన ప్రియతమ గణతంత్ర దేశం యొక్క ప్రగతి, శ్రేయస్సు కోసం అచంచలమైన నిబద్ధతతో పనిచేసేలా స్ఫూర్తి నివ్వాలని ఆయన ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ ఈ సందర్భంగా ఆకాంక్షించారు.






