'ఇది తుఫానుకు ముందు ప్రశాంతత'.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఏఐ ఫొటో

by Malleboina Mahesh |

ఇది తుఫానుకు ముందు ప్రశాంతత" అంటూ ఇరాన్ నౌకల నేపథ్యంలో ఉన్న ఏఐ ఫోటోను ట్రంప్ షేర్ చేశారు. ఇరాన్‌పై అమెరికా దాడుల వ్యూహాలు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

ఇది తుఫానుకు ముందు ప్రశాంతత.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఏఐ ఫొటో
X

దిశ, వెబ్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సోషల్ మీడియా వేదికగా పెట్టిన ఏఐ పోస్ట్ ప్రస్తుతం అంతర్జాతీయంగా సంచలనంగా మారింది. ఇరాన్‌తో యుద్ధ వాతావరణం, ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. ఆయన ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా రూపొందించిన గ్రాఫిక్ ఫోటోను పంచుకుంటూ, “ఇది తుఫాను వచ్చే ముందు ఉండే ప్రశాంతత” (It was calm before the storm) అంటూ ఒక రహస్య హెచ్చరికను జారీ చేశారు. ఆ చిత్రంలో ట్రంప్ అమెరికా నౌకాదళ అడ్మిరల్‌తో కలిసి ఒక యుద్ధ నౌక పై నిలబడి ఉండగా, వారి వెనుక సముద్రంలో ఇరాన్ జెండాతో ఉన్న కొన్ని నౌకలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ప్రస్తుతం అమెరికా-ఇరాన్ మధ్య జరుగుతున్న శాంతి చర్చలు నిలిచిపోవడంతో ఈ పోస్ట్ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇరాన్‌పై అమెరికా వైమానిక దాడులను పునఃప్రారంభించేందుకు, వారి మిలిటరీ, చమురు కేంద్రాలను లక్ష్యంగా చేసుకునే వ్యూహాలపై ట్రంప్ రక్షణ విభాగంతో కసరత్తు చేస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంటోంది. దౌత్యపరమైన చర్చలు విఫలమైతే రాబోయే రోజుల్లో ఇరాన్‌పై భారీ దాడులు జరిగే అవకాశం ఉందనే సంకేతాలను ఈ మైండ్ గేమ్ ద్వారా ట్రంప్ పంపారు. ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన 'స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్' వివాదం నడుస్తున్న తరుణంలో ఈ నిగూఢ హెచ్చరిక పశ్చిమాసియాలో మరోసారి తీవ్ర టెన్షన్ రేపుతోంది.

Next Story