- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ముమ్మాటికీ ఇది లీకేజీల సర్కారే.. తెలంగాణ జాగృతి చీఫ్ కవిత ఫైర్
ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం (Professor Jayashankar Agricultural University)లో ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.

దిశ, వెబ్‌డెస్క్: ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం (Professor Jayashankar Agricultural University)లో ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న నలుగురు వర్సిటీ సిబ్బందిని సస్పెండ్ చేయడంతో పాటు థర్డ్ ఇయర్ బీఎస్సీ (Agriculture) చదువుతున్న 35 మంది ఇన్ సర్వీస్ అభ్యర్థుల ప్రవేశాలను రద్దు చేసి వారిని తిరిగి వ్యవసాయశాఖకు పంపిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ఈ నేపథ్యంలోనే పేపర్ లీకేజీ వ్యవహారంపై తెలంగాణ జాగృతి చీఫ్, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’ వేదికగా ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఇది ముమ్మాటికే లీకేజీల సర్కారేనని అన్నారు. కాంగ్రెస్ ఏలుబడిలో ఉద్యోగ నియామకాల్లో అవకతవకలు.. ఇప్పుడు అగ్రికల్చర్ యూనివర్సిటీ పరీక్ష పేపర్లు లీక్ అంటూ ఫైర్ అయ్యారు. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)పర్యవేక్షణలో ఉన్న విద్యాశాఖలో ఇలాంటి ఘటనలు జరగడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. వర్సిటీల భూములు అమ్ముకొని సొమ్ము చేసుకోవడం తప్ప ఆయనకు విద్యార్థుల గోడు పట్టదంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్య వ్యవస్థను గాడిలో పెట్టండి.. లేదంటే విద్యాశాఖను మరో మంత్రికి అప్పగించండి.. అంటూ కవిత చేసిన ట్వీట్ పొలిటికల్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది.
Read More..






