ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా బూట్లు, బెల్టులు

by Muthe.Rajitha |

గవర్నమెంట్ స్కూళ్లలోని విద్యార్థులందరికీ ఉచితంగా బూట్లు, బెల్టులు పంపిణీ

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా బూట్లు, బెల్టులు
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల పట్ల మరో కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి గవర్నమెంట్ స్కూళ్లలోని విద్యార్థులందరికీ ఉచితంగా బూట్లు, బెల్టులు పంపిణీ చేయనున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. కాగా ఇప్పటికే విద్యార్థులకు రెండు జతల స్కూల్ యూనిఫామ్ ఉచితంగా ఇస్తుండగా.. బూట్లు, బెల్టులు కూడా ఇస్తే బాగుంటుందని విద్యాశాఖ చేసిన ప్రతిపాదనకు సీఎం రేవంత్ అంగీకరించారు. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న దాదాపు 20 లక్షల మంది విద్యార్థులు లబ్ది పొందనున్నారు.

అలాగే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లలో మొదటి విడతలో బాలికలు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా ఇకపై ప్రభుత్వ స్కూళ్లలో 1వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఉదయం అల్పాహారం కూడా అందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

Next Story