- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈ సినిమాకి చాలా మంది హీరోలు ఉన్నారు: తరుణ్ భాస్కర్
మల్టీ ట్యాలెంటెడ్ తరుణ్ భాస్కర్ (Tarun Bhaskar)లీడ్ రోల్‌లో నటిస్తున్న హిలేరియస్ విలేజ్ కామెడీ ఎంటర్ టైనర్ 'ఓం శాంతి శాంతి శాంతిః(Om Shanti Shanti Shanti).

దిశ, సినిమా: మల్టీ ట్యాలెంటెడ్ తరుణ్ భాస్కర్ (Tarun Bhaskar)లీడ్ రోల్‌లో నటిస్తున్న హిలేరియస్ విలేజ్ కామెడీ ఎంటర్ టైనర్ 'ఓం శాంతి శాంతి శాంతిః(Om Shanti Shanti Shanti). ఈషా రెబ్బా (Eesha Rebba)హీరోయిన్ గా నటిస్తుండగా.. A R సజీవ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఎస్ ఒరిజినల్స్, మూవీ వెర్స్ స్టూడియోస్ బ్యానర్స్ పై సృజన్ యరబోలు, ఆదిత్య పిట్టీ, వివేక్ కృష్ణని, అనుప్ చంద్రశేఖరన్, సాధిక్ షేక్, నవీన్ సనివరపు ఈ వెంచర్‌ను నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలై ప్రమోషనల్ కంటెంట్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఓం శాంతి శాంతి శాంతిః జనవరి 30న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఇందులో తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ.. ‘‘ఇందులో గోదారి యాస చక్కగా పలికాను.
దానికి కారణం తనే. రాత్రి నిద్రలో కూడా నాకు ఆ గోదారి యాస, ఆ ప్రాంతమే కలలోకి వచ్చేద( నవ్వుతూ) నందు చక్కని మాటలు రాశాడు. ఈ సినిమాకి చాలా మంది హీరోలు ఉన్నారు. అందరూ రిమేక్ అంటున్నారు. కానీ ఈ కథని ఒరిజినల్ గా ప్రజెంట్ చేయడానికి నిదర్శనమే ఆ పాట. జై క్రిష్ వజ్రం లాంటి సాంగ్ ఇచ్చాడు. ధీరజ్ బ్రహ్మాజీ గారు అందరూ కూడా పాత్రలో ఇమిడిపోయారు. ఈ నగరానికి ఏమైంది బాయ్స్ అందరికీ థాంక్ యూ. వాళ్ళకి షూటింగ్ అని చెప్పాను. అందుకే వచ్చారు (నవ్వుతూ) ఫ్యామిలీ అంతా కలిసి ఒక సినిమా చేసిన ఫీలింగ్ కలుగుతుంది. ఈ రోజుల్లో సినిమాలు నిర్మించడం చాలా కష్టమైన పని. ఏ సినిమా ఎప్పుడు ఆడుతుందో తెలీదు. ఇలాంటి సమయంలో ప్రొడ్యూసరే హీరో. ఈ మూవీ నిర్మాతలు అందరికీ హాట్సాఫ్. ఇంతమంది హీరోల మధ్యలో నేను చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ నే. అందరూ థియేటర్స్ లో వెళ్లి సినిమా చూడండి. చాలా ఎంజాయ్ చేస్తారు’’ అని అన్నాడు.






