- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లోకేష్ బైక్ ర్యాలీ.. రెచ్చిపోయిన దొంగలు
దిశ, ఏపీ బ్యూరో : తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జాతీయ..latest telugu news

X
దిశ, ఏపీ బ్యూరో : తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళగిరిలో బైక్ ర్యాలీ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ బైక్ ర్యాలీలో దొంగల హల్‍చల్ చేశారు. నారా లోకేష్ బైక్ ర్యాలీలో పాల్గొనేందుకు కొందరు పార్టీ కార్యకర్తలు మంగళగిరిలోని కేంద్రకార్యాలయం వద్ద బైక్‌లు పార్కింగ్ చేశారు. ర్యాలీ అనంతరం తమ బైక్‌లు తీసుకునేందుకు వచ్చిన వారికి అవి కనిపించలేదు. నాలుగు బైక్‌లు చోరీకి గురైనట్లు పార్టీ కార్యాలయ సిబ్బంది గుర్తించింది. అనంతరం బైకులు చోరీపై టీడీపీ నేతలు మంగళగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు పార్టీ కేంద్ర కార్యాలయంలో సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలించారు.
Next Story






