ఉల్లిపాయలు కొనడానికి వెళ్తే.. స్కూటీ డిక్కీలోని రూ.5 లక్షలు మాయం

by Malleboina Mahesh |

పల్నాడులో రైతుకు ఊహించని షాక్! స్కూటీ డిక్కీలో పెట్టిన రూ.5 లక్షల నగదు చోరీ. ఉల్లిపాయలు కొనడానికి వెళ్లిన కొద్ది నిమిషాల్లోనే ఘటన. సీసీటీవీలో రికార్డ్.

ఉల్లిపాయలు కొనడానికి వెళ్తే.. స్కూటీ డిక్కీలోని రూ.5 లక్షలు మాయం
X

దిశ, వెబ్ డెస్క్: ఓ రైతు తన ఆర్థిక అవసరాల కోసం అప్పు తెచ్చుకున్న నగదును భద్రంగా స్కూటీ డిక్కీలో పెట్టుకున్నాడు. ఉల్లిపాయలు కొనడానికి షాప్ ముందు స్కూటీని ఉంచి వెళ్లిన కాసేపటికి ఆ నగదు మాయమైంది. పల్నాడు జిల్లా జొన్నలగడ్డ బైపాస్ రోడ్డు వద్ద జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకట సత్యనారాయణ అనే రైతు తన వ్యక్తిగత అవసరాల నిమిత్తం రూ.5 లక్షల నగదును అప్పుగా తెచ్చుకున్నాడు. ఆ డబ్బును బ్యాగులో పెట్టి, స్కూటీ డిక్కీలో భద్రపరిచాడు.

జొన్నలగడ్డ బైపాస్ రోడ్డు సమీపంలో ఉల్లిపాయలు కొనుగోలు చేసేందుకు రైతు తన స్కూటీని రోడ్డు పక్కన ఆపి వెళ్లాడు. కేవలం కొద్ది నిమిషాల వ్యవధిలోనే తిరిగి వచ్చి చూసేసరికి స్కూటీ డిక్కీ తెరిచి ఉంది. లోపల ఉన్న రూ.5 లక్షల నగదు బ్యాగ్ కనిపించకుండా పోయింది. దీంతో ఆందోళనకు గురైన రైతు చుట్టుపక్కల వారిని విచారించినా ఫలితం లేకపోయింది. గుర్తు తెలియని వ్యక్తి డిక్కీ తెరిచి నగదును దోచుకెళ్లినట్లు నిర్ధారణ అయింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Next Story