నా బాడీ మొత్తాన్ని జూమ్ చేసి చూశారు.. ఆ స్టార్ డైరెక్టర్ బండారం బయటపెట్టిన ఈషా రెబ్బా

by Mallepaka Hamsa |   (  Updated:2026-01-20 08:53:57  IST  )

టాలీవుడ్ యంగ్ బ్యూటీ ఈషా రెబ్బా(Eesha Rebba) ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 12 ఏళ్లు గడుస్తున్నా, ఒక స్టార్ హీరోయిన్‌కు ఉండాల్సిన అన్ని అర్హతలు ఉన్నా.. సరైన హిట్ మాత్రం అందడం లేదు.

నా బాడీ మొత్తాన్ని జూమ్ చేసి చూశారు.. ఆ స్టార్ డైరెక్టర్ బండారం బయటపెట్టిన ఈషా రెబ్బా
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ బ్యూటీ ఈషా రెబ్బా(Eesha Rebba) ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 12 ఏళ్లు గడుస్తున్నా, ఒక స్టార్ హీరోయిన్‌కు ఉండాల్సిన అన్ని అర్హతలు ఉన్నా.. సరైన హిట్ మాత్రం అందడం లేదు. వరుస సినిమాల్లో నటిస్తున్నప్పటికీ ఆశించినంత స్థాయిలో గుర్తింపు దక్కించుకోలేకపోతుంది. త్వరలో ఈ అమ్మడు ‘ఓం శాంతి శాంతి శాంతి’ (Om Shanti Shanti Shanti)సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఇందులో తరుణ్ భాస్కర్(Tarun Bhaskar) సరసన రొమాన్స్ చేయనుంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జనవరి 23న థియేటర్స్‌లోకి రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ జోరు పెంచిన ఈషా ఓ ఇంటర్వ్యూలో భాగంగా షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఒక స్టార్ డైరెక్టర్ తనను ఎంతలా అవమానించారో గుర్తు చేసుకుని ఎమోషనల్ అయింది. కేవలం తన స్కిన్ టోన్ సరిగ్గా లేదనే సాకుతో ఒక దర్శకుడు ప్రవర్తించిన తీరుపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

‘‘ఓ దర్శకుడు నా ఫోటోలను స్క్రీన్‌పై అంగుళం అంగుళం జూమ్ చేసి చూశారు. నీ మోచేతులు నల్లగా ఉన్నాయి.. నువ్వు ఇంకా తెల్లగా ఉండాలి అంటూ అందరి ముందూ మొహమాటం లేకుండా అనేశారు. ఆ మాటలకు నేను షాకయ్యాను, చాలా ఏడ్చాను. కనీసం కొంచెం తెల్లగా పుట్టి ఉంటే బాగుండు అని అప్పుడు అనిపించింది’’ అంటూ ఈషా కన్నీళ్లు పెట్టుకుంది. అలాగే తెలుగు అమ్మాయి అని చెప్పుకోవద్దని, అవకాశాలు కావాలంటే పార్టీలకు రావాలని కొందరు ఉచిత సలహాలు ఇచ్చేవారని ఆమె మండిపడ్డారు. తల్లి చనిపోయిన 12వ రోజే షూటింగ్‌కు వెళ్లాల్సి వచ్చిందని, పేరెంట్స్ సపోర్ట్ లేకపోతే ఇండస్ట్రీలో ఆడపిల్లను అందరూ టార్గెట్ చేస్తారని ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఫిల్మ్ నగర్‌లో కలకలం రేపుతున్నాయి.

Next Story