7 గంటలకే ప్రారంభం అన్నారు.. 9:30 అయినా జాడలేని పోలియో చుక్కల బాక్సులు!

by Jakkula.Mamatha |

చిన్నారులను పోలియో రహిత భారత లక్ష్యానికి చేరువ చేసే పల్స్ పోలియో కార్యక్రమం ఆదివారం ఉదయం 7 గంటల నుంచే ప్రారంభమవుతుందని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, ఇల్లంతకుంట మండలంలోని పలు గ్రామాల్లో ఉదయం 9:30 గంటలు దాటినా కార్యక్రమం ప్రారంభం కాలేదు.

7 గంటలకే ప్రారంభం అన్నారు.. 9:30 అయినా జాడలేని పోలియో చుక్కల బాక్సులు!
X

దిశ, ఇల్లంతకుంట: చిన్నారులను పోలియో రహిత భారత లక్ష్యానికి చేరువ చేసే పల్స్ పోలియో కార్యక్రమం ఆదివారం ఉదయం 7 గంటల నుంచే ప్రారంభమవుతుందని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, ఇల్లంతకుంట మండలంలోని పలు గ్రామాల్లో ఉదయం 9:30 గంటలు దాటినా కార్యక్రమం ప్రారంభం కాలేదు. సంబంధిత పోలియో కేంద్రాలకు పోలియో చుక్కల బాక్సులు చేరకపోవడంతో చిన్నారులకు చుక్కలు వేయలేని పరిస్థితి నెలకొంది. ఉదయం నుంచే చిన్నారులతో పోలియో కేంద్రాలకు చేరుకున్న తల్లిదండ్రులు నిరీక్షించాల్సి వచ్చింది. ముందస్తు ప్రణాళికతో నిర్వహించాల్సిన కీలక ఆరోగ్య కార్యక్రమంలో ఇలాంటి జాప్యం చోటు చేసుకోవడం పట్ల స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

పోలియో చుక్కల బాక్సులు సకాలంలో ఎందుకు చేరలేదు..? రవాణా వ్యవస్థలో లోపమా..? లేక అధికారుల నిర్లక్ష్యమా..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చిన్నారుల ఆరోగ్యానికి సంబంధించిన అత్యంత ముఖ్యమైన కార్యక్రమంలో జరిగిన ఈ ఆలస్యంపై సంబంధిత అధికారులు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు. అలాగే జాప్యానికి కారణమైన వారిపై చర్యలు తీసుకుని, వెంటనే అన్ని కేంద్రాల్లో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Next Story