- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘టాక్సిక్’ చూశాక యష్ ఫ్యాన్స్ మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం.. అంచనాలను పెంచిన హుమా ఖురేషి
ఈ సినిమాలో యశ్‌తో కలిసి వర్క్ చేసినప్పటి నుండి నేను ఆయనకు చాలా పెద్ద ఫ్యాన్ అయిపోయాను.

దిశ, సినిమా: కన్నడ రాకింగ్ స్టార్ యష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘టాక్సిక్’ పలు వాయిదాల తర్వాత ఆగస్టు 26న విడుదలకు సిద్ధమైంది. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించగా.. నయనతార, హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ కీలక పాత్రలో నటిస్తుండటం విశేషం. తెలుగు, కన్నడ, హిందీ, తమిళ, మలయాళ, ఇంగ్లీష్ భాషల్లో ఏకకాంలో విడుదలవుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ కోసం యష్ ఫ్యాన్స్‌తో పాటు నెటిజన్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కెజీఎఫ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో అందరి కళ్లు ‘టాక్సిక్’పై పడ్డాయి. ఈనేపథ్యంలో.. తాజాగా, ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హుమా ఖురేషి.. ‘టాక్సిక్’ యష్ ఫ్యాన్స్‌కు గొప్ప విందు కాబోతుందని అంచనాలను రెట్టింపు చేశారు. "ఈ సినిమాలో యశ్‌తో కలిసి వర్క్ చేసినప్పటి నుండి నేను ఆయనకు చాలా పెద్ద ఫ్యాన్ అయిపోయాను. అంతకుముందు ఆయన నాకు కేవలం ఒక మాస్ ఫాలోయింగ్ ఉన్న పెద్ద స్టార్‌గా మాత్రమే తెలుసు. కానీ, ఆయన వర్క్ చేసే విధానం, సినిమా పట్ల ఆయనకు ఉన్న కసి, యష్ ఆలోచనా విధానం దగ్గరి నుండి చూశాక నేను ఆయన నుండి ఎంతో నేర్చుకున్నాను" అంటూ యశ్‌పై ప్రశంసల కురిపించారు.
ప్రేక్షకులు థియేటర్లకు వచ్చినప్పుడు వారికి ఒక బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడం కోసమే చిత్రబృందం మొత్తం పగలు రేయి కష్టపడుతోందని ఆమె చెప్పారు. సినిమా అవుట్‌పుట్ ఎలా వస్తుందనే దానిపై హుమా స్పందిస్తూ.. "నేను ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ఒక 8 నుండి 9 నిమిషాల చిన్న కట్ ఫుటేజ్ చూశాను. అది చూశాక నా మైండ్ బ్లాక్ అయింది. మేకర్స్ నిజంగా ఏదో ఒక అద్భుతాన్ని స్క్రీన్‌పై చూపించబోతున్నారని అర్థం అయింది. సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా సరే, ప్రేక్షకులకు ఇది ఒక సినిమాటిక్ స్టోర్మ్‌లా తగలడం ఖాయం. యశ్ తన నటనతో ఇందులో నెక్స్ట్ లెవెల్‌కు వెళ్ళిపోయారు. ఆయన అభిమానులకు ఇది ఒక భారీ విందు లాంటి సినిమా చెప్పారు. అంతేకాకుండా ఫ్యాన్స్ మైండ్ బ్లాక్ అవుతుందనే నమ్మకం తనకు ఉందని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా.. ఇటీవల చిత్ర యూనిట్ అంతా కలిసి డిన్నర్ చేశామని, ఆ సమయంలో నటీనటుల మధ్య ఎంతో ప్రేమ కనిపించిందని హుమా పంచుకున్నారు. ఈ సినిమాలో ఎవరికీ ఎలాంటి ఈగోలు, పోటీ తత్వాలు లేవని.. ఎందుకంటే ప్రతి నటుడికి స్క్రీన్‌పై మెరిసేందుకు దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ సమానమైన ప్రాధాన్యత ఇచ్చారని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ తమ పరిధిలో అద్భుతంగా నటించారని, ముఖ్యంగా యశ్ పెర్ఫార్మెన్స్ థియేటర్లలో పూనకాలు తెప్పిస్తుందని ఆమె పేర్కొన్నారు






