హుస్నాబాద్‌లో రోడ్ల నిర్మాణ పనులకు నిధులు మంజూరు:మంత్రి పొన్నం ప్రభాకర్

by Jakkula.Mamatha |   (  Updated:2026-06-28 06:39:35  IST  )

హుస్నాబాద్ నియోజకవర్గంలో భారీ మొత్తంలో రోడ్ల నిర్మాణ పనులకు రూ.148.97 కోట్ల నిధులు మంజూరైనట్లు బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.

హుస్నాబాద్‌లో రోడ్ల నిర్మాణ పనులకు నిధులు మంజూరు:మంత్రి పొన్నం ప్రభాకర్
X

దిశ,సైదాపూర్: హుస్నాబాద్ నియోజకవర్గంలో భారీ మొత్తంలో రోడ్ల నిర్మాణ పనులకు రూ.148.97 కోట్ల నిధులు మంజూరైనట్లు బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అందులో సైదాపూర్ మండలం దుద్దెనపల్లి, ఎక్లాస్పూర్, సోమారం, వెన్నంపల్లి మీదుగా శంకరపట్నం మండలం కొత్తగట్టు హైవే రోడ్డు వరకు 10.90 కిలోమీటర్లకు రూ.9.57 కోట్ల నిధులు మంజూరైనట్లు తెలిపారు. హుస్నాబాద్ నియోజకవర్గానికి భారీ మొత్తంలో రోడ్ల అభివృద్ధికి రూ. 148.97 కోట్లు మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. ఈ పనులు పూర్తయితే గ్రామీణ ప్రాంతాల ప్రజల రాకపోకలు సులభతరం కావడంతో పాటు వ్యవసాయ, వాణిజ్య, విద్య, వైద్య సేవలకు మెరుగైన అనుసంధానం ఏర్పడుతుందని మంత్రి తెలిపారు.

Next Story