- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎం రేవంత్ రెడ్డి పర్యటన వేళ తీవ్ర ఉద్రిక్తత.. ఎన్జీ కాలేజీ వద్ద టీఆర్ఎస్ ధర్నా
కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఎలా జిల్లాకు వస్తున్నారని ప్రశ్నిస్తూ తెలంగాణ రక్షణ సేన పార్టీ ఆధ్వర్యంలో ఎన్ జి కాలేజ్ ముందు నిరసన వ్యక్తం చేశారు

దిశ, నల్లగొండ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఎలా జిల్లాకు వస్తున్నారని ప్రశ్నిస్తూ తెలంగాణ రక్షణ సేన పార్టీ ఆధ్వర్యంలో ఎన్ జి కాలేజ్ ముందు నిరసన వ్యక్తం చేశారు. గో బ్యాక్ రేవంత్ రెడ్డి.. ఆరు గ్యారంటీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ప్లే కార్డ్స్ ప్రదర్శించి నిరసన వ్యక్తం చేశారు. సీఎం డౌన్ డౌన్.. మంత్రి కోమటిరెడ్డి డౌన్ డౌన్.. అంటూ రోడ్డుపై బైఠాయించారు. అప్రమత్తమైన టూ టౌన్ పోలీసులు ఎస్ఐ సైదా బాబా ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేసి టూ టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని నిరసన వ్యక్తం చేస్తున్న తెలంగాణ రక్షణ సేన పార్టీ నాయకులపై మాజీ మున్సిపల్ కౌన్సిలర్ నడిరోడ్డు పైన దాడి చేశారు. పార్టీ నేతలను ప్రశ్నించడానికి మీకు ఏం హక్కు ఉందంటూ దాడి చేశారు. ఆ పక్కనే పోలీసులు ఉన్నప్పటికీ నివారించే ప్రయత్నం కూడా జరగలేదు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు మేడి నరేష్, మాదవక్క, కందాడి మణిపాల్ తదితరులు పాల్గొన్నారు.






