- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెళ్లింట తీవ్ర విషాదం.. లారీ ఢీకొని యువకుడు మృతి
పెళ్ళి ఇంట్లో ఉండాల్సిన ఆనందోత్సాహాలు గంటల వ్యవధిలోనే ఆవిరై విషాద ఛాయలు అలుముకున్న దుర్ఘటన సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలంలో ఆదివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది.

దిశ, అర్వపల్లి(జాజిరెడ్డిగూడెం): పెళ్ళి ఇంట్లో ఉండాల్సిన ఆనందోత్సాహాలు గంటల వ్యవధిలోనే ఆవిరై విషాద ఛాయలు అలుముకున్న దుర్ఘటన సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలంలో ఆదివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో కారు డ్రైవర్ గా పనిచేస్తున్న కొమ్మాల గ్రామానికి చెందిన బయ్య మధు(22) బొల్లంపల్లి గ్రామానికి చెందిన తమ బంధువుల వివాహానికి శనివారం హాజరయ్యాడు. పెళ్ళి తంతు ముగిసిన తర్వాత బారాత్ కార్యక్రమం ముగించుకొని నూతన దంపతులను పెళ్లి కూతురు తల్లిగారి గ్రామం కేతేపల్లి మండలం కొత్తపేటలో దించి, అర్ధరాత్రి బొల్లంపల్లి గ్రామానికి కారులో బయలుదేరాడు.
మార్గమధ్యలో గోపాల్ రెడ్డి నగర్ సమీపంలోకి రాగానే సూర్యాపేట వైపు అతివేగంతో వెళ్ళుతున్న లారీ బలంగా కారును ఢీకొట్టడంతో మధు అక్కడికక్కడే మృతిచెందాడు. రోడ్డుపై జరిగిన ప్రమాదం గురించి పోలీసులకు సమాచారం అందించగా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తుంగతుర్తి ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. మృతుని తండ్రి అవిలయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మధు తెలిపారు. చేతికందిన ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడంతో కుటుంబ సభ్యుల రోదన వర్ణనాతీతం. ఈ ఘటనతో కొమ్మాల గ్రామంతో పాటు, బొల్లంపల్లి, కొత్తపేట గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.






