- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎంపీ కేశినేని చిన్ని పై సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేసిన కేశినేని నాని
విజయవాడ తెలుగుదేశం పార్టీ (TDP) ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) కుటుంబ బినామీ సంస్థపై ఆయన సోదరుడు, మాజీ ఎంపీ కేశినేని నాని సంచలన ఆరోపణలు చేశారు.

దిశ, వెబ్ డెస్క్: విజయవాడకు చెందిన కేశినేని బ్రదర్స్ పంచాయతీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), హైడ్రా వద్దకు చేరుకుంది. విజయవాడ TDP ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) కుటుంబ బినామీ సంస్థపై ఆయన సోదరుడు, మాజీ ఎంపీ, వైసీపీ నేత కేశినేని నాని సంచలన ఆరోపణలు చేశారు. హైదరాబాద్ శివార్లలోని శంషీగూడలో కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురవుతోందంటూ తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి ఆయన అధికారికంగా ఫిర్యాదు చేశారు. కూకట్‌పల్లి సమీపంలోని శంషీగూడ (ప్రగతినగర్) వద్ద 'టీజీఐఐసీ ఐటీ పార్క్' (TGIIC IT Park) కోసం కేటాయించిన 112.72 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకోవడానికి కేశినేని చిన్ని, ఆయన బినామీ సంస్థలైన 'మెసర్స్ ఎక్సెల్లా' (M/s Exella) తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయని ఆరోపించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED), నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT) ఇచ్చిన పాత ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టి, నకిలీ లీగల్ సెటిల్‌మెంట్లతో నిందితులు ఏకంగా సుప్రీంకోర్టును సైతం తప్పుదోవ పట్టించారని నాని ధ్వజమెత్తారు.
తెలంగాణ ప్రభుత్వానికి చెందిన ఈ ఐటీ పార్క్ స్థలాన్ని తప్పుడు డాక్యుమెంట్లు, కోర్టును తప్పుదోవ పట్టించేలా అక్రమ ఒప్పందాల ద్వారా స్వాధీనం చేసుకునేందుకు జరుగుతున్న ప్రయత్నాలను తక్షణమే అడ్డుకోవాలని రేవంత్ రెడ్డిని కేశినేని నాని కోరారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడటంలో దూకుడుగా వ్యవహరిస్తున్న హైడ్రా (HYDRAA), అడ్వకేట్ జనరల్ ఈ విషయంలో తక్షణమే జోక్యం చేసుకుని ఆక్రమణల ప్రయత్నాలను అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ఇంతటి భారీ ల్యాండ్ స్కామ్‌కు ఒడిగట్టిన ఎంపీ కేశినేని చిన్ని, ఆయన వెనుక ఉన్న సూత్రధారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని నాని కోరారు. ఈ ఫిర్యాదు కాపీని ఆయన పీఎం నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడులకు కూడా ట్యాగ్ చేయడంతో తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఈ భూ వివాదం పెద్ద దుమారం రేపుతోంది.






