- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కంకర వేశారు.. రోడ్డు మరిచారు!
నాగర్ కర్నూల్ జిల్లా బల్మూర్ మండల పరిధిలోని తోడేళ్ల గడ్డ గ్రామంలో కంకర వేశారు కానీ రోడ్డు వేయడం మరిచారంటూ తోడేళ్లగడ్డ గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

దిశ ,బల్మూర్: నాగర్ కర్నూల్ జిల్లా బల్మూర్ మండల పరిధిలోని తోడేళ్ల గడ్డ గ్రామంలో కంకర వేశారు కానీ రోడ్డు వేయడం మరిచారంటూ తోడేళ్లగడ్డ గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బల్మూర్ మండల పరిధిలోని ఈ గ్రామానికి గతంలో ఉన్న మట్టి రోడ్డుపై కంకర పరిచి చేతులు దులుపుకోవడంతో, వాహనాల రాకపోకల తాకిడికి కంకర అంతా చెల్లాచెదురైపోయింది. ఈ దుస్థితికి కారణాలు తూతూ మంత్రం పనులే అని గ్రామస్తులు వాపోతున్నారు. అయితే పూర్తి స్థాయి బీటీ రోడ్డు వేయకుండా, మట్టి రోడ్డుపై కేవలం కంకర చల్లి వదిలేసి అయిపోయింది అన్నట్టుగా చేతులు దులుపుకున్నారని గ్రామస్తులు తమ సందేహాన్ని వ్యక్తపరుస్తున్నారు.
కానీ, చిన్నపాటి వర్షానికే కంకర కొట్టుకుపోయి, రోడ్డు మొత్తం గుంతలమయం, బురదమయంగా మారుతోంది. నిత్యం ఏదో ఒక అవసరం నిమిత్తం అంబులెన్స్‌లు, వాహనాలు రాలేని పరిస్థితి ఎదురవుతుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిల్లలు, వృద్ధులు నడవాలంటేనే భయపడుతున్నారు. మాకు దిక్కెవరు అని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు మారుతున్నాయి, ఎమ్మెల్యేలు మారుతున్నారు.
మా ఊరికి మాత్రం రోడ్డు రావడం లేదు. తమకు కావాల్సిన కనీస సౌకర్యాలని తీర్చే నాధుడే కరువయ్యాడని గ్రామ ప్రజలు తీవ్ర ఆవేదన గురవుతున్నారు. నియోజకవర్గంలో గెలిచేది ఒకరు, మా ఊర్లో గెలిచేది ఇంకొకరు. అందుకే మమ్మల్ని పట్టించుకోవడం లేదు అనే భావన గ్రామంలో బలంగా ఉంది. అయితే ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి తోడేళ్ల గడ్డ గ్రామానికి శాశ్వత బీటీ రోడ్డు నిర్మించాలి అని తాత్కాలిక మరమ్మతులు కాదు, తరాలు గుర్తుంచుకునే రోడ్డు కావాలని గ్రామస్థులు ముక్తకంఠంతో కోరుతున్నారు.






