ప్రమాదమని తెలిసినా.. పట్టించుకోరు!

by Jakkula.Mamatha |

బావి అక్కడే.. ప్రమాదకర మూలమలుపు అక్కడే ఉంది.

ప్రమాదమని తెలిసినా.. పట్టించుకోరు!
X

దిశ, నిజాంపేట: బావి అక్కడే.. ప్రమాదకర మూలమలుపు అక్కడే ఉంది. నిజాంపేట మండలం నస్కల్ - రాంపూర్ వెళ్లే రోడ్డులో ప్రమాదకరమైన బావి వద్ద గతంలో.. సర్పంచ్ ప్రవీణ్ ప్రమాద హెచ్చరికల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అవి గాలివానలకు చిరిగిపోయి కనుమరుగైపోయాయి. మళ్ళీ, అక్కడ అధికారులు ఎలాంటి బోర్డులు గానీ, రక్షణ గానీ ఏర్పాటు చేయలేదు. ఈ రోడ్డు గుండా నిత్యం భూం పల్లి, సిద్దిపేట ఇతర ప్రాంతాలకు ప్రజలు అవసరాల నిమిత్తం వెళ్లి రాత్రి సమయాల్లో వస్తుంటారు. కాబట్టి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. వెంటనే.. అధికారులు సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఇరు గ్రామాల ప్రజలు వేడుకుంటున్నారు.

Next Story