రూ. 1,775.51 కోట్లతో ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో రహదారి పనులకు శంకుస్థాపన

by Jakkula.Mamatha |

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా రూ. 1,775.51 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న రహదారుల విస్తరణ, మరమ్మత్తు పనులకు రాష్ట్ర మంత్రులు సోమవారం శంకుస్థాపన చేశారు.

రూ. 1,775.51 కోట్లతో ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో రహదారి పనులకు శంకుస్థాపన
X

దిశ, మక్తల్: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా రూ. 1,775.51 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న రహదారుల విస్తరణ, మరమ్మత్తు పనులకు రాష్ట్ర మంత్రులు సోమవారం శంకుస్థాపన చేశారు. హైబ్రిడ్‌ యాన్యుటీ మోడల్‌ (HAM) ఫేజ్‌-1 కింద మొత్తం నాలుగు ప్యాకేజీల పనులను ప్రభుత్వం ప్రారంభించింది. ఇందులో భాగంగా నారాయణపేట జిల్లా మక్తల్‌లో రూ. 573 కోట్లతో చేపట్టనున్న 'మహబూబ్‌నగర్‌-1' ప్యాకేజీ పనులకు ఉదయం 11 గంటల ప్రాంతంలో మంత్రులు భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో రోడ్లు-భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పర్యాటక-సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, శానససభ్యులు వాకిటి శ్రీహరిలతో పాటు పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Next Story